E-Paper
Advertisement

Andhra King Taluka : రామ్ తో అనిల్ రావిపూడి సినిమా? ఆ షో లో ఆసక్తికర వ్యాఖ్యలు

Andhra King Taluka : రామ్ తో అనిల్ రావిపూడి సినిమా? ఆ షో లో ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

Andhra King Taluka : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ప్రస్తావన వస్తే మొదటి వినిపించే పేరు రాజమౌళి. ఆ తర్వాత వరుసలో ఉండేది అనిల్ రావిపూడి. ఇప్పటివరకు అనిల్ రావిపూడి చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాన్ని పొందుతుంది. కొంతమంది అనిల్ రావిపూడి ని మినీ రాజమౌళి అని కూడా అంటారు. అనిల్ సినిమా భగవంత్ కేసరి మినహాయిస్తే మిగతా అన్ని సినిమాలు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి.

ఎంటర్టైన్మెంట్ సినిమాలను అనిల్ రావిపూడి చాలా అద్భుతంగా రాస్తాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధిస్తుంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమాలకు విపరీతంగా బ్రహ్మరాదం పడతారు. అందుకే సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాలకు దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. తను దర్శకుడు అవ్వడానికంటే ముందు రచయితగా తన ప్రస్తానాన్ని మొదలుపెట్టాడు.

రామ్ తో అనిల్ సినిమా 

Advertisement

అనిల్ రావిపూడి రచయితగా చాలా సినిమాలకు పనిచేశాడు అందులో రామ్ పోతినేని నటించిన కందిరీగ సినిమా ఒకటి. సంతోష్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది. అయితే దానిలో మంచి ఇన్వాల్వ్మెంట్ అనిల్ రావిపూడి కి ఉంది.

అనిల్ రావిపూడి దర్శకుడు అయిపోయిన తర్వాత రామ్ హీరోగా సినిమా చేయలేదు. అనిల్ రావిపూడి దర్శకుడుగా సినిమాలు చేస్తూనే ఒక షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సరిగమప షో కి రామ్ పోతినేని గెస్ట్ హాజరయ్యారు.

Advertisement

మన షో కు వచ్చాడు రామ్, ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ధూమ్ ధామ్. మా కాంబినేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ వచ్చినప్పుడు మాత్రం బద్దలై పోతుంది అంటూ అనిల్ రావిపూడి రామ్ ను ఉద్దేశిస్తూ చెప్పాడు. అనిల్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ తో రామ్ పోతినేని తో అనిల్ సినిమా చేస్తాడు అని క్లారిటీ వచ్చేసింది.

అనిల్ రేంజ్ మారిపోతుందా?

అనిల్ రావిపూడి సినిమాలు వరుస సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు యంగ్ హీరోస్ తో పాటు సీనియర్ హీరోస్ కూడా తనకు డేట్స్ ఇచ్చి సినిమాలు చేస్తున్నారు. ఇదివరకే వెంకటేష్ హీరోగా సక్సెస్ అందుకున్నారు, బాలకృష్ణ హీరోగా సినిమా చేసి కూడా సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సంక్రాంతి కనుక ఈ సినిమా విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి కి ఏ రేంజ్ ఫ్యాన్ బేస్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా సంక్రాంతికి రాబోతున్న ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి దీనికి కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అయితే కలెక్షన్స్ వస్తాయి. ఇక్కడితో అనిల్ రేంజ్ కూడా కంప్లీట్ గా మారిపోతుంది అని కొంతమంది అభిప్రాయం.

Also Read: Dhanush: ఆ పాటను కేవలం కామెడీగా చేశాం, అదే శాపం అయింది

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×