E-Paper
Advertisement

Paanch Minar Movie Review : ‘పాంచ్ మినార్’ మూవీ రివ్యూ : బోరింగ్ క్రైమ్ డ్రామా

Paanch Minar Movie Review : ‘పాంచ్ మినార్’ మూవీ రివ్యూ : బోరింగ్ క్రైమ్ డ్రామా
Advertisement

Paanch Minar Movie Review : రాజ్ తరుణ్ కి చాలా కాలంగా హిట్టు లేదు. వరుస సినిమాలు చేస్తున్నాడు కానీ.. ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడటం లేదు. దీంతో ఓటీటీ కంటెంట్ కూడా చేసేస్తున్నాడు. ఇటీవల ‘చిరంజీవ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాని ఫలితంతో పట్టింపు లేకుండా ఇంతలోనే ‘పాంచ్ మినార్’ అంటూ మరో సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా అయినా హిట్టు కొట్టేలా ఉందా? లేక అతని కెరీర్లో ఇంకో ప్లాప్..గా మిగిలిపోతుందా? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి..

కథ :

కృష్ణ చైతన్య అలియాస్ కిట్టు (రాజ్ తరుణ్) ఓ నిరుద్యోగి. సంపాదన లేని కారణంగా అతన్ని కుటుంబ సభ్యులు తక్కువ చేసి చూస్తుంటారు. అయినప్పటికీ ఇతనికి ఒక ప్రియురాలు ఉంటుంది. ఆమె పేరు ఖ్యాతి(రాశీ సింగ్). ఆమె కూడా ఇతనికి ఉద్యోగం సంపాదించమని ఒత్తిడి చేస్తుంది. దీంతో ఆమె కోరుకున్నట్టు సాఫ్ట్ వేర్ జాబ్ లో చేరాను అని అబద్దం చెప్పి క్యాబ్ డ్రైవర్ అవుతాడు. అది కూడా చెవిటి వాడిని అనే అబద్దాన్ని సింపతీగా వాడి.ఇదిలా ఉంటే.. ఒక రోజు ఇద్దరు క్రిమినల్స్ కిట్టు క్యాబ్ బుక్ చేసుకుంటారు.

Advertisement

ముందుగా వెళ్లి ఒక గ్యాంగ్స్టర్ ని హత్య చేస్తారు. దీంతో వాళ్లకి రూ.5 కోట్ల డబ్బు లభిస్తుంది. వెంటనే దాన్ని తీసుకుని కిట్టు క్యాబ్లో వెళ్లిపోయేందుకు ట్రై చేస్తారు. కానీ ఇంతలో పోలీసులు కిట్టు క్యాబ్ ను సోదా చేస్తారు. క్రిమినల్స్ పోలీసులకి చిక్కుతారు. కానీ డబ్బుని మాత్రం కిట్టు కొట్టేస్తాడు? అది ఎలా? ఆ డబ్బుతో కిట్టు ఏం చేశాడు. ఆ డబ్బు కోసం కిట్టుని క్రిమినల్స్ ఏం చేశారు. అసలు సినిమాకి ‘పాంచ్ మినార్’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు. సాధారణంగా అయితే ఛార్మినార్ కదా? మరి అది పాంచ్ మినార్ ఎందుకు అయ్యింది? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.

విశ్లేషణ :

ఈ మధ్యనే రాజ్ తరుణ్ నటించిన ‘చిరంజీవ’ అనే సినిమా ఆహా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అందులో రాజ్ తరుణ్ ఆంబులెన్స్ డ్రైవర్ గా కనిపించాడు. అందులో కూడా అతను అప్పులతో సతమతమవ్వడం.. అనుకోని విధంగా అతనికి లభించిన ఓ పవర్ కారణంగా డబ్బు సంపాదించడం జరుగుతుంది. చాలా వరకు అవే లేయర్స్ కలిగిన కథ ఈ ‘పాంచ్ మినార్’. రామ్ కుడుముల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

Advertisement

కొన్ని ఎపిసోడ్స్ బాగానే తీశాడు. కథ ఎక్కడా మిస్ లీడ్ కాకుండా సాగుతుంది. క్రైం కామెడీ సినిమాలకి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అందరికీ డబ్బు అవసరం. నిజజీవితంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. సినిమాలో కూడా హీరో ఆర్థిక ఇబ్బందులతో సతమతమై తర్వాత కుబేరుడు అయ్యాడనుకోండి.. అందరికీ నచ్చుతుంది. కానీ హీరో క్యారెక్టర్ ఆడియన్స్ రిలేట్ చేసుకునేలా ఉండాలి. ఆ విషయంలోనే ఇక్కడ దర్శకుడు ఫెయిల్ అయ్యాడు.

హీరో క్యారెక్టర్ పై ఆడియన్స్ ఎక్కువ లాజిక్కులు వెతుకుతున్నారు అంటే.. డౌట్ లేకుండా అది స్క్రీన్ ప్లే లోపం అనడంలో సందేహం లేదు. కానీ కామెడీ కొన్ని చోట్ల పేలడం, అలాగే క్లైమాక్స్ డీసెంట్ గా ఉండటం వల్ల ‘పాంచ్ మినార్’ పాస్ మార్కులకు దగ్గరగా వెళ్తుంది.మరి ఫైనల్ గా పాసవుతుందా అంటే అది బాక్సాఫీస్ రిజల్ట్ ను బట్టే..! టెక్నికల్ గా నిర్మాణ విలువలు చెప్పుకునే రేంజ్లో లేవు. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఫస్ట్ టైం ట్రాక్ తప్పిన ఫీలింగ్ ఇచ్చింది. ఎడిటింగ్ మాత్రం ఓకే.

నటీనటుల విషయానికి వస్తే.. రాజ్ తరుణ్ ఈ మధ్య ఒకే తరహా పాత్రలు చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. దానిని కంటిన్యూ చేస్తూనే ఈ సినిమాలో అతని పెర్ఫార్మన్స్ ఉంటుంది. రాశీ సింగ్ ఛాన్స్ దొరికిన ప్రతిసారి పెర్ఫార్మన్స్ తో కంటే గ్లామర్ తో నెట్టుకురావాలని ప్రయత్నించింది.అజయ్ ఘోష్, రవి వర్మ, నితిన్ ప్రసన్న వంటి నోటెడ్ ఆర్టిస్టులు ఈ సినిమాలో చాలా మందే ఉన్నారు. కానీ ఎవరి పెర్ఫార్మన్స్ కూడా మంతముగ్దుల్ని చేయలేదు.

ప్లస్ పాయింట్స్ :

కామెడీ
క్లైమాక్స్
ఎడిటింగ్

మైనస్ పాయింట్స్ :

నిర్మాణ విలువలు
సాగదీత
రొటీన్ కథ

మొత్తంగా.. ‘పాంచ్ మినార్’ రెగ్యులర్ క్రైం కామెడీ సినిమా. కొన్ని ఎపిసోడ్స్ బాగున్నా.. పూర్తిగా సంతృప్తినివ్వదు.

Paanch Minar Movie Rating : 2/5

Related News

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

Big Stories

Advertisement
×