E-Paper
Advertisement

Director Bobby: డైరెక్టర్ బాబీ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్ట్ లా.. సినిమా తియొచ్చు..

Director Bobby: డైరెక్టర్ బాబీ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్ట్ లా.. సినిమా తియొచ్చు..
Advertisement

Director Bobby: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంట్ డైరెక్టర్ బాబీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలను అందించిన ఆయన వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. మెగాస్టార్ చిరంజీవితో చేసిన వాల్తేరు వీరయ్య మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయన మరో ప్రాజెక్ట్ ని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో బాబీ తాజాగా ఓ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.. ఆ సందర్భంగా ఆయన తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం అది మరోసారి హాట్ టాపిక్ గా మారింది. బాబి లవ్ స్టోరీ లో ఉన్న ట్విస్టులేంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

డైరెక్టర్ బాబీ మాస్ లవ్ స్టోరీ..

డైరెక్టర్ బాబీ ‘బ్యాండు మేళం’ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ కు గెస్టు గా హాజరైయారు.. యాంకర్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చి నవ్వులు పూయించారు. స్టైలిష్ గా ఉండే ఈ డైరెక్టర్ తన క్యూట్ లవ్ స్టోరీని బయట పెట్టాడు. మీ లవ్ స్టోరీని చెప్పండి మీ ఆవిడని ఎలా పడేసారో అని అడగ్గా.. దానికి బాబీ సమాధానం చెప్తూ.. నేను బైక్‌పై బాగా యాక్సిలేటర్ ఇచ్చి, గట్టిగా హార్న్ కొట్టి నా భార్యను లవ్‌లో పడేశాను. అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడున్న వాళ్లంతా కేరింతలతో కేకలు పెట్టారు. ప్రస్తుతం బాబీ అగ్ర హీరోలతో భారీ ప్రాజెక్టులు చేస్తూ బిజీగా వున్నారు, ఇక ఇలాంటి సరదా మాటలతో తనలోని మాస్ యాంగిల్‌ను బయటపెట్టి అందరిని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో బాబి లవ్ స్టోరీ గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Also Read :‘సేవ్ ది టైగర్ సీజన్ 3’ స్టోరీని లీక్ చేసిన అభినవ్.. అస్సలు ఊహించని ట్విస్ట్..

‘బ్యాండ్ మేళం’ మూవీ.. 

శ్రీదేవి, రోషన్ కాంబినేషన్‌లో వస్తున్న ‘బ్యాండు మేళం’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.. గతంలో కోర్ట్ మూవీతో మెప్పించిన ఈ జంట మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు హాజరైంది.. గతంలో ఆంధ్ర నేపథ్య కథతో మెప్పించిన ఈ జంట, ఈసారి తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేస్తున్నారు. నిన్న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ వీడియోని విడుదల చేస్తారు.. డైరెక్టర్ బాబీ చేతుల మీదగా గ్లింప్స్ వీడియో రిలీజ్ అయ్యింది. అచ్చ తెలుగు తెలంగాణ స్టోరీ లాగా ఉందని ఇప్పటికే వీడియోని చూసిన నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.. మొత్తానికి ఈ బ్యూటిఫుల్ జంట మరోసారి స్క్రీన్ మీద కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. డిఫరెంట్ లవ్ స్టోరీ తో రాబోతున్న ఏ మూవీ ఈసారి ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ ఈ ఏడాది చివరిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన మూవీ సూపర్ హిట్ అవడంతో ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు..

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×