E-Paper
Advertisement

Poorna OTT release date : కూతురిని సింగర్ గా మార్చడానికి ఒంటరి తండ్రి తాపత్రయం… కట్ చేస్తే బుర్రబద్దలయ్యే ట్విస్ట్

Poorna OTT release date : కూతురిని సింగర్ గా మార్చడానికి ఒంటరి తండ్రి తాపత్రయం… కట్ చేస్తే బుర్రబద్దలయ్యే ట్విస్ట్
Advertisement

Poorna OTT release date : ఓటీటీలలో ఎమోషనల్, ఫీల్ గుడ్ సినిమాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనసును మెలిపెట్టే కథలతో తెరకెక్కే సినిమాలను స్పెషల్ గా చూడాలనుకుంటే చాలా కష్టం. అలాంటి సినిమాల కోసం వెతుకుతున్న వాళ్ళకే గుడ్ న్యూస్. పిల్లలను పెంచి పెద్ద చేయడంలో తల్లి తండ్రులు ఇద్దరికీ సమాన బాధ్యత ఉంటుంది. అలాగే వాళ్ళు చూపించే ప్రేమ, బాధ్యతహ కూడా ముఖ్యమే. కానీ అనుకోని పరిస్థితుల్లో పేరెంట్స్ లో ఒక్కరికీ ఏమన్నా అయినా కూడా ఆ తరువాత పిల్లల పరిస్థితి దారుణంగా ఉంటుంది. అందులోనూ తల్లి లేకపోతే ఆ బాధ వర్ణనాతీతం. కొంతమంది తండ్రులు పిల్లల గురించి ఆలోచించి మరో పెళ్లి కూడా చేసుకోరు. పిల్లల కోసమే జీవితాన్ని అంకితం చేస్తారు. కానీ అక్కడ కూడా విధి వక్రీకరిస్తే… మరి ఇలాంటి స్టోరీతో వచ్చిన ఆ మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

చౌపాల్ ఓటీటీలో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది పంజాబీ మూవీ ‘పూర్ణ’ గురించి. తండ్రి-కుమార్తెల ఎమోషనల్ స్టోరీతో, మ్యూజిక్ జర్నీతో నడుస్తుంది. భిండా ఆజ్లా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఓ ఒంటరి తండ్రి తన కుమార్తె సంగీత కలలను సాకారం చేయడానికి చేసే పోరాటాన్ని మనసుకు హత్తుకునే విధంగా చూపించబోతున్నారు. చిన్న పంజాబీ పట్టణం నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఫిబ్రవరి 19న చౌపాల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా స్ట్రీమింగ్‌లో అందుబాటులో ఉంటుంది. చౌపాల్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు నేరుగా చూడవచ్చు. భిండా ఆజ్లా ప్రముఖ పంజాబీ మ్యూజిషియన్, ఈ చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషించడంతో పాటు దర్శకుడిగా కూడా పని చేశాడు. సిమ్రాన్ గిల్ కుమార్తె పాత్రలో నటించింది. ఈ చిత్రం తండ్రి ప్రేమను గుర్తుచేస్తూ, ప్రేక్షకుల హృదయాలను కదిలించేలా ఉంటుంది. ఇక చౌపాల్ ఓటీటీ గురించి తెలియని ప్రేక్షకులు చాలమందే ఉన్నారు. ఈ ప్లాట్‌ఫామ్ పంజాబీ సినిమాలు, ఒరిజినల్ సిరీస్‌లకు ప్రసిద్ధి చెందింది.

Advertisement

Read Also : ఎట్టకేలకు డైరెక్ట్ గా ఓటీటీలోకి అవార్డు విన్నింగ్ మూవీ… స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ ?

కథలోకి వెళ్తే…

ఈ సినిమా కథ ఒంటరి తండ్రి (భిండా ఆజ్లా) చుట్టూ తిరుగుతుంది. ఆటో డ్రైవర్ అయిన అతను తన భార్య చనిపోయిన తర్వాత కుమార్తెను (సిమ్రాన్ గిల్) సింగిల్ పేరెంట్ గా పెంచుతాడు. ఆర్థిక స్తోమత పెద్దగా లేకపోయినా, కుమార్తె సంగీత కలలను సాకారం చేయడానికి తన సర్వస్వాన్ని త్యాగం చేస్తాడు. కుమార్తె ప్రముఖ గాయనిగా మారాలని కలలు కంటుంది. కానీ అంతలోనే ఆమెకు ఊహించని అనారోగ్య సమస్య వస్తుంది. దీంతో ఆ తండ్రి ప్రపంచం తలక్రిందులవుతుంది. మరి ఇంతకీ ఆ తండ్రి కూతురు కలను ఎలా నెరవేర్చాడు ? ఆ అమ్మాయి అనుకున్నట్టుగానే సింగర్ గా మారిందా లేదా ? ఆమెకున్న ఆరోగ్య సమస్య ఏంటి? క్యూర్ అయ్యిందా ? అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×