E-Paper
Advertisement

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్ సీజన్ 3’ స్టోరీని లీక్ చేసిన అభినవ్.. అస్సలు ఊహించని ట్విస్ట్..

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్ సీజన్ 3’ స్టోరీని లీక్ చేసిన అభినవ్.. అస్సలు ఊహించని ట్విస్ట్..
Advertisement

Save the Tigers 3 : ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని హాట్ స్టార్ లో వచ్చిన కామెడీ డ్రామా థ్రిల్లర్ ‘సేవ్ ది టైగర్స్’.. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ తో పోలిస్తే రెండో సీజన్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.. అయితే ఈ సిరీస్ కు మూడవ సీజన్ రాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ సీజను మరింత కామెడీగా ఉండబోతుందని జనాలు దీన్ని చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ కు సంబంధించిన టీజర్ ని ఇటీవల రిలీస్ చేసిన విషయం తెలిసిందే. అతి త్వరలోనే సీజన్ స్ట్రీమింగ్ కి రాబోతుందని తెలుస్తుంది. ఈ క్రమంలో ఇందులో నటించిన అభినవ్ గోమఠం తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భాగంగా ఈ సీజన్ స్టోరీ గురించి లీక్ చేసాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వడంతో ఈ సీజన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి…

సేవ్ ది టైగర్స్ 3 స్టోరీ..

ఈమధ్య సినిమాలు కన్నా వెబ్ సిరీస్ లకు డిమాండ్ పెరిగిపోతుంది. ఒకప్పుడు సినిమాలను ఎక్కువగా చూసే జనాలు ఈ మధ్య మాత్రం వెబ్ సిరీస్ లను చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. ముఖ్యంగా కామెడీ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్ లకు డిమాండ్ రోజురోజుకి పెరిగిపోతుంది.. ఈమధ్య జనాలని ఎక్కువగా ఆకట్టుకున్న కామెడీ ఎంటర్టైనర్ వెబ్సైట్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సేవ్ ది టైగర్స్.. డిఫరెంట్ టైటిల్ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక ప్రస్తుతం మూడో సీజన్ మరో కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే రిలీజ్ అయిన టీజరు అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న అభినవ్ గొమటం ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఈ సీజన్ యొక్క స్టోరీని లీక్ చేశారు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మొదటి ఎపిసోడ్ పెద్దగా అనిపించదు కానీ ఎపిసోడ్ చివర్లో మాత్రం జనాలని బీభత్సంగా ఆకట్టుకుంటుంది.. మొత్తం ఏడు ఎపిసోడ్స్ బాగుంటాయని అభినవ్ అన్నారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది..

Advertisement

Also Read :డార్లింగ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఏ సినిమా ఎప్పుడు రిలీజంటే.?

సీజన్ 3 ప్రోమో విషయానికొస్తే..

మహి వి. రాఘవ్ క్రియేట్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో ప్రియదర్శి పులికొండ, అభినవ్ గోమఠం, కృష్ణ చైతన్య, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని శర్మ కీలక పాత్రలో నటించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఇప్పటికే స్ట్రీమింగ్ చేయబడిన రెండు సీజన్లు జనాలను బాగా ఆకట్టుకున్నాయి. దాంతో ఇప్పుడు మూడో సీజన్ పై ఆసక్తి నెలకొంది.. మొన్న ఈ సీజన్ 3 కు సంబందించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సీజన్-3 ఉంటుందని మేకర్స్ రెండో సీజన్ ఎండింగ్ లోనే క్లారిటీ ఇచ్చారు.. ఇప్పటివరకైతే ఈ సీజన్ కి సంబంధించిన అప్డేట్స్ ఇంకా వదలలేదు కానీ అభినవ్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఏప్రిల్ ఎండింగ్ లోపల ఈ సీజన్ ప్రసారం కాబోతుందని సమాచారం.. మరి ఎప్పుడు ఈ సీజన్ ప్రసారం అవుతుందో చూడాలి..

Related News

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

Big Stories

Advertisement
×