E-Paper
Advertisement

Akhanda 2 Roxx Car: అఖండ2లో బాలయ్య నడిపిన పవర్ ఫుల్ కారు ఇదే.. దీని ప్రత్యేకతలు చూశారా?

Akhanda 2 Roxx Car: అఖండ2లో బాలయ్య నడిపిన పవర్ ఫుల్ కారు ఇదే.. దీని ప్రత్యేకతలు చూశారా?
Advertisement

Akhanda Roxx Car: గాడ్ ఆఫ్ మాసేస్ నందమూరి బాలకృష్ణ(Balakrishna), దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Sreenu) కాంబినేషన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పాలి. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుంది అంటే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి. త్వరలోనే ఆఖండ 2(Akhanda 2)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

రోక్స్ ను పరిచయం చేసిన బోయపాటి…

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా గురువారం హైదరాబాద్ లో దర్శకుడు బోయపాటి శ్రీను అఖండ 2 తాండవం  సినిమాలో బాలకృష్ణ ఉపయోగించిన రోక్స్(ROXX Car) వాహనాన్ని లాంచ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాలో బాలకృష్ణ కోసం ప్రత్యేకంగా ఈ వాహనాన్ని రూపొందించారని తెలుస్తోంది. మరి బాలయ్య ఉపయోగించిన ఈ రోక్స్ ప్రత్యేకతలు ఏంటి అనే విషయానికి వస్తే .. ఎక్స్ డ్రైవ్ అత్యధిక ఇంజనీరింగ్ తో నిర్మించగా ఎక్స్ స్టూడియోస్ ఈ వెహికల్ కు అద్భుతమైన సినిమాటిక్ లుక్ అందించింది.

ప్రత్యేకంగా డిజైన్ చేసిన రోక్స్…

Advertisement

ఈ సినిమాలో బాలయ్య కోసం సుమారు 10 ప్రత్యేకమైన వెహికల్స్ డిజైన్ చేయించారని తెలిపారు. ఇక ఈ రోక్స్ వెనుక అమర్ కృషి ఉందని తెలిపారు. పవర్ వారసత్వం మాస్ ఎనర్జీకి నిదర్శనంగా ఈ వాహనం రూపొందించినట్లు బోయపాటి వెల్లడించారు. ఇక అఖండ 2 లో బాలకృష్ణ అద్భుతమైన నటనను ప్రతిబింబించే విధంగా ఈ వెహికల్ రూపొందించారని, ఈ వెహికల్ డిజైన్ చేసిన అమర్ ను దర్శకుడు అభినందించారు. మరి బిగ్ స్క్రీన్ పై బాలకృష్ణ నటించిన యాక్షన్స్ సన్ని వేశాలలో ఈ వెహికల్ ఎలా మెస్మరైజ్ చేస్తుందో తెలియాల్సి ఉంది.

Advertisement

గతంలో బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లెజెండ్ సినిమాలో కూడా బాలయ్య కోసం బోయపాటి ప్రత్యేకంగా బైక్ డిజైన్ చేయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అఖండ 2 కోసం రోక్స్ కారును డిజైన్ చేయించారనే విషయం తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు వారం రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీనే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక నేడు చిత్ర బృందం హైదరాబాద్ లోని కైతలాపూర్ గ్రౌండ్స్ లో ఎంతో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

Also Read: Prabhas Wedding: ప్రభాస్ పెళ్లి.. అతిధులుగా జానీ సిన్స్ మియా ఖలీఫా.. వీడియో వైరల్

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×