E-Paper
Advertisement

Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్‌కు ఇకపై కష్టాలు, ముందస్తు బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు, ఇక జైలుకే

Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్‌కు ఇకపై కష్టాలు,  ముందస్తు బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు, ఇక జైలుకే
Advertisement

Pinnelli Brothers: పల్నాడు జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడికి కష్టాలు రెట్టింపు అయ్యాయి. గత కేసుల వ్యవహారం వాళ్లని వెంటాడుతోంది. పల్నాడులో జరిగిన జంట హత్యల కేసులో వారికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పిన్నెల్లి సోదరులకు  ముందస్తు బెయిల్ రద్దు చేసింది.

జంట  హత్యల కేసు.. పిన్నెల్లి బ్రదర్స్ కష్టాలు

Advertisement

పల్నాడు జిల్లాలో జరిగిన జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు కష్టాలు తీవ్రమయ్యాయి. వారు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఈ మేరకు ఇద్దరు సభ్యుల గల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో పిన్నెల్లి సోదరులకు ముందస్తు బెయిల్‌కు అర్హత లేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

పిటిషన్లు విచారణలో ఇరువర్గాల మధ్య వాదోప వాదనలు చోటు చేసుకున్నాయి. విచారణకు సహకరించాలని న్యాయస్థానం చెప్పినా, సహకరించలేదన్నారు ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది. సాక్షులను బెదిరించారని, సాక్ష్యాలను ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం చేశారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.

Advertisement

కేవలం రెండువారాలు మాత్రమే

ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం, అరెస్టు చేసేందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని చెప్పింది. లొంగిపోవడానికి రెండు వారాల గడువు ఇవ్వాలని పిన్నెల్లి తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ముందస్తు బెయిల్‌ విషయంలో సమయం ఎలా ఇస్తారని జస్టిస్‌ సందీప్‌ మెహతా వ్యాఖ్యలు చేశారు.

సెక్షన్‌ 161 కింద నమోదు చేసిన డాక్యుమెంట్లు నిందితులకు ఎలా అందాయని ధర్మాసనం ప్రశ్నించింది.  పోలీసులు తమకు 161 స్టేట్‌మెంట్ ఇచ్చారని పిన్నెల్లి తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వివరించారు. ఈ విషయంలో ఏపీ పోలీసుల తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది.  పోలీసుల నుంచి నిందితులకు పూర్తి సహకారం అందుతోందని ధర్మాసనం ఈ సందర్భంగా అభిప్రాయపడింది.

ALSO READ:  తిరుమల లడ్డూ కేసు.. టీటీడీలో అరెస్టుల పర్వం, మరో ఇద్దరు ?

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు హత్యల కేసులో పిన్నెల్లి సోదరుల మందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అయితే హైకోర్టు తీర్పును పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. వారిద్దరికీ మధ్యంతర రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు.

తుది నిర్ణయం వెలువడే వరకు వారిని అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో ఏ-1 జవిశెట్టి శ్రీను, ఏ-2 తోట వెంకట్రావు, ఏ-3 తోట గురవయ్య, ఏ-4 నాగరాజు, ఏ-5 తోట వెంకటేశ్వర్లు, ఏ-6 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ- 7 పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని నిందితులుగా ఉన్నారు.

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×