E-Paper
Advertisement

Seethakka: ములుగులో బీఆర్ఎస్‌కు షాక్.. మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేతలు!

Seethakka: ములుగులో బీఆర్ఎస్‌కు షాక్.. మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేతలు!
Advertisement

Seethakka:  ములుగు స్వేచ్ఛ: ములుగు మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గండ్రకోట శ్రీదేవి సుదీర్, నాయకులు మంత్రి సీతక్క (Seethakka) ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో  (Congress Party) చేరారు. పార్టీలో చేరిన వారందరికీ సీతక్క కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party)అధికారంలోకి వచ్చిన నాటి నుండి ములుగు జిల్లా వ్యాప్తంగా మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి చూసి పార్టీలో చేరినట్లు గండ్రకోట శ్రీదేవి సుధీర్ వెల్లడించారు.

భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తాం 

ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క చోరవతో జరిగిన అభివృద్ధి పనులు చూసి భవిష్యత్తులో ములుగు పట్టణం అభివృద్ధికి సహకరిస్తూ మునిసిపాలిటీ ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తానని సుధీర్ తెలిపారు. గోవిందరావుపేట మండలానికి చెందిన ఉద్యమ నాయకులు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ అన్న సోదరుడు కొయ్యడ చందు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ నుండి మరి కొంతమంది, అదేవిధంగా ములుగు మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి చింతల్ నిప్పుల చంద్రకళ బిక్షపతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రి సీతక్క సమక్షంలో చేరారు.

Advertisement

Also Read: MLA Murali Naik: కబ్జా చేసే వాళ్ళని ఓడించండి.. నిజాయితీ నాయకత్వానికే ఓటు వేయండి : ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్!

టిఆర్ఎస్ పార్టీ కి తెలంగాణలో మనుగడ లేదు 

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీ కి తెలంగాణలో మనుగడ లేదని గ్రహించుకున్న ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరారన్నారు. రానున్న రోజుల్లో పార్టీలో చేరిన వారందరికీ సముచిత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నూతనంగా మున్సిపాలిటీగా ఏర్పడిన ములుగు లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలుచుకొని చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవికుమార్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బిసి సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్, వివిధ మండలాల అధ్యక్షులు, చైర్మన్లు, డైరెక్టర్లు, జిల్లా నాయకులు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మీదే : మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి!

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×