E-Paper
Advertisement

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ లో స్పెషల్ సాంగ్ .. అందుకే పెట్టలేదన్న డైరెక్టర్!

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ లో స్పెషల్ సాంగ్ .. అందుకే పెట్టలేదన్న డైరెక్టర్!
Advertisement

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా మార్చి 26వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా మొదలుపెట్టారు ఇటీవల ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల చేయగా ఈ సాంగ్ కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో దర్శకుడు హరీష్ శంకర్ ప్రమోషన్ కార్యక్రమాలలో వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

స్పెషల్ సాంగ్ పై స్పెషల్ ఫోకస్..

ఇకపోతే ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమాలో కూడా దర్శక నిర్మాతలు స్పెషల్ సాంగ్ ఉండేలా చూస్తున్నారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో వచ్చే సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో స్పెషల్ సాంగ్ లేకపోవడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఎందుకు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ పెట్టలేదనే విషయం గురించి దర్శకుడు హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

డిప్యూటీ సీఎం స్పెషల్ సాంగ్ చేయడమేంటి?

Advertisement

స్పెషల్ సాంగ్ అంటే కచ్చితంగా హీరోయిన్లను చాలా గ్లామర్ గా చూపించాలి. ఇలా గ్లామర్ గా కనిపించే హీరోయిన్ల పక్కన పవన్ కళ్యాణ్ డాన్స్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ హీరో అయితే కచ్చితంగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ పెట్టే వాళ్ళం కానీ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఆయన ఉన్న స్థాయిని దృష్టిలో పెట్టుకుని తాము ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ పెట్టలేదని హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ గురించి దర్శకుడు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఉస్తాద్ భగత్ నా సొంత సినిమా…

Advertisement

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా రీమేక్ సినిమా అంటూ కూడా వార్తలు రావడంతో ఇది రీమేక్ సినిమా కాదని ఇది నా సొంత కథ అని తెలిపారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల నటించగా రాశి ఖన్నా కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ ను ఢీకొట్టడానికి నటుడు పార్థిబన్ విలన్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓజి సినిమా మంచి సక్సెస్ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: Lavanya Tripathi: చిరంజీవి పై ట్రోలింగ్ అందుకే రియాక్ట్ అయ్యాను..లావణ్య క్లారిటీ

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×