Sampoornesh Babu: టాలెంట్ ఉండాలే కానీ బ్యాక్ గ్రౌండ్ తో పనిలేదని నిరూపిస్తున్న అతి కొద్దిమంది సెలబ్రిటీలలో సంపూర్ణేష్ బాబు(Sampoornesh babu) కూడా ఒకరు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంపూర్ణేష్ బాబు.. హృదయ కాలేయం, కొబ్బరి మట్ట వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 2014లో వచ్చిన ‘హృదయ కాలేయం’ సినిమాతో వెండితెర హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన సంపూర్ణేష్ బాబు.. మొదటి సినిమాతోనే ఊహించని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ వచ్చిన ఈయన మధ్యలో 2017లో బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్నాడు. కానీ అక్కడ ఎక్కువ రోజులు ఉండలేక స్వతహాగా బయటకి వచ్చేసాడు.
ఇకపోతే కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా.. సైలెంట్ గా ఉండిపోయిన సంపూర్ణేష్ బాబు.. ఇప్పుడు నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ది ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నారు. ముఖ్యంగా ది ప్యారడైజ్ లో సంపూ లుక్ రిలీజ్ చేయగా.. ఈ లుక్ ఆకట్టుకోవడంతో మరొకసారి ఆయన వార్తల్లో నిలిచారు. చింపిరి జుట్టు, మాసిన గడ్డంతో, గొడ్డలి పట్టుకొని రౌడీ అవతారంలో సంపూర్ణేష్ బాబు కనిపించాడు అయితే అలాంటి లుక్కుతో ప్రేక్షకులకు దర్శనమిచ్చిన సంపూర్ణేష్ బాబు.. సడన్గా లగ్జరీ స్పోర్ట్స్ కారులో కనిపించి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ సమయంలోనే ఏకంగా లక్షల విలువ చేసే లగ్జరీ స్పోర్ట్స్ కార్ లో తిరగడం అనేది మామూలు విషయం కాదు ఇకపోతే సంపూర్ణేష్ బాబు రెడ్ కలర్ స్పోర్ట్స్ కార్ లో హైదరాబాద్ రోడ్లపై కనిపించడంతో ఆయన అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సంపూర్ణేష్ బాబు కొన్న ఈ లగ్జరీ కార్ విషయానికొస్తే.. ఎంజీ సైబర్ స్టర్ బ్రాండ్ కు చెందినదిగా తెలుస్తోంది. దీని ధర సుమారుగా 75 లక్షల పైమాటే. ఏదేమైనా ఒకప్పుడు సైకిల్ పై తిరిగిన సంపూర్ణేష్ బాబు ఇప్పుడు ఏకంగా లక్షల విలువైన స్పోర్ట్స్ కారు నడుపుతుండడంతో ఆయన ఎదుగుదలను చూసి అభిమానులు, నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:Rashmika -Vijay: సంగీత్ వేడుకల్లో మరింత వినోదంగా.. మెస్మరైజ్ చేసిన విరోష్ జంట!
సంపూర్ణేష్ బాబు అసలు పేరు నరసింహాచారి. హృదయ కాలేయం చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన.. ఆ తర్వాత కొబ్బరిమట్ట సినిమాలో నటించారు. ఆ తర్వాత కరెంటు తీగ సినిమాలో కామియో పాత్ర పోషించిన ఈయన.. పెసరట్టు , బందిపోటు, సింగం 1 2 3, జ్యోతిలక్ష్మి, వేర్ ఇస్ విద్యాబాలన్ , వినోదం 100% , భద్రం జాగ్రత్త బ్రదర్, రాజా ది గ్రేట్, దేవదాస్ ఇలా పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గత ఏడాది సోదరా అనే సినిమాలో నటించిన ఈయన.. బిగ్ బాస్ తర్వాత కళ్యాణి అనే టీవీ సీరియల్ లో గెస్ట్ పాత్ర పోషించారు.