E-Paper
Advertisement

Lavanya Tripathi: చిరంజీవి పై ట్రోలింగ్ అందుకే రియాక్ట్ అయ్యాను..లావణ్య క్లారిటీ

Lavanya Tripathi: చిరంజీవి పై ట్రోలింగ్ అందుకే రియాక్ట్ అయ్యాను..లావణ్య క్లారిటీ
Advertisement

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న మెగా కోడలుగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న లావణ్య ఇటీవల పండంటి మగ బిడ్డకు కూడా జన్మనిచ్చారు. ప్రస్తుతం ఈమె తన వృత్తిపరమైన జీవితంలోనూ అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సతీలీలావతి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా మార్చి 6 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేస్తున్నారు.

చిరంజీవి పై విమర్శలు.. మెగా కోడలు కౌంటర్..

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లావణ్య త్రిపాటికి చిరంజీవి పై వచ్చిన విమర్శల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడంతో చిరంజీవి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడారు అయితే చాలామంది చిరంజీవి అబ్బాయిది ఒక విధంగా అమ్మాయిలను ఒక విధంగా చూస్తారని తనకు వారసుడు అంటేనే ఇష్టం అనే విధంగా సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేశారు. ఇలా చిరంజీవి గురించి వస్తున్న విమర్శలపై మెగా హీరోలు ఎవరు స్పందించలేదు మెగా ఫ్యామిలీ కూడా మౌనంగా ఉంది. కానీ లావణ్య త్రిపాఠి మాత్రం ఈ ట్రోల్స్ పై గట్టిగా సమాధానం ఇచ్చింది.

Advertisement

నా ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకోను..

చిరంజీవి గారి గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు. నా ఫ్యామిలీ జోలికి వస్తే అసలు ఊరుకోను అంటూ ఈమె తనదైన శైలిలోనే మాస్ వార్నింగ్ ఇచ్చారు. అలా రియాక్ట్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటూ తాజాగా ఇంటర్వ్యూ సందర్భంగా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు లావణ్య సమాధానం చెబుతూ..చిరు మామయ్య పిల్లలతో ఎలా ఉంటారు నాకు తెలుసు. పిల్లల్ని ఎప్పుడు కేర్ చేస్తుంటారు. నేను ఇవన్నీ చూశాను. ఇలా చూసిన తర్వాత చిరంజీవి గురించి తప్పుగా మాట్లాడటంతో రియాక్ట్ అయ్యానని తెలిపారు.
చిరు మామయ్య మాట్లాడిన మాటలపై ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు యూట్యూబ్ వీడియోలు కూడా రిలీజ్ చేశారు .

Advertisement

మహిళలకు చాలా గౌరవం ఇస్తారు..

చిరు మామయ్య ఇంట్లో మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తారో నాకు తెలుసు. అందుకే ఈ విషయంపై స్పందించాల్సి వచ్చింది అంటూ లావణ్య క్లారిటీ ఇచ్చారు. ఇలా మీరు ఈ విమర్శలపై స్పందించగా మెగా ఫ్యాన్స్ నుంచి ఎంతో మంచి మద్దతు లభించింది. మరి మీ మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అంటూ ప్రశ్న ఎదురవు కావడంతో ఈ విషయం గురించి మా ఇంట్లో పెద్దగా ఎవరు సీరియస్ గా తీసుకోలేదని లావణ్య త్రిపాఠి తెలిపారు. ఏది ఏమైనా మెగా కుటుంబం గురించి చిన్న విమర్శలు వచ్చిన లావణ్య త్రిపాఠి వెంటనే స్పందిస్తూ కౌంటర్లు ఇవ్వడంతో మెగా అభిమానుల మనసు దోచుకుందనే చెప్పాలి.

Also Read: Lavanya Tripathi: మా లవ్ ను నిహారిక క్రాక్ చేసింది.. అసలు స్టోరీ బయటపెట్టిన లావణ్య!

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×