దేశీ మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల జోష్ కొనసాగుతోంది. చాలా మంది పెట్రో టూ వీలర్స్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మార్కెట్ కొత్త ఊపుతో దూసుకెళ్తోంది. నెలవారీ హోల్ సేల్ డిస్పాచ్‌లు 100,000 యూనిట్లకు పైగా ఉన్నాయి. 2025లో రిటైల్ అమ్మకాలు దాదాపు 1.27 మిలియన్లు దాటాయి. వీటిలో ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయి. తొలుత స్టార్టప్ కంపెనీలు అందుబాటులోకి తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు, ప్రముఖ మోటార్ సైకిల్స్ కంపెనీలు కూడా అందిపుచ్చుకున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ ను అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
TVS మోటార్ కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో టాప్ లో కొనసాగుతోంది. 2025లో iQube ఒక్కటే దాదాపు 2, 98,000 యూనిట్లను అమ్మింది. TVS మొత్తం ఎలక్ట్రిక్ టూవీలర్స్ మార్కెట్‌లో దాదాపు పావు వంతు స్థానాన్ని ఆక్రమించింది. దాని వెనుక బజాజ్ ఆటో నిలిచింది. ఎలక్ట్రిక్ చేతక్ 2025లో 260,000 యూనిట్లకు పైగా అమ్మకాలు సాధించింది.
ఇక అథర్ ఎనర్జీ ఇప్పటికీ మార్కెట్ లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. 2025లోఈ బ్రాండ్‌ను 150,000 యూనిట్లను అమ్మింది. టెక్ ఆధారిత ఛాలెంజర్‌గా ప్రారంభమైన కంపెనీ ఇప్పుడు గట్టి పోటీని ఎదుర్కొంటుంది. అటు హీరో మోటోకార్ప్, దాని విడా సబ్ బ్రాండ్ 110,000 కంటే ఎక్కువ యూనిట్లను క్లియర్ చేసింది. ఈ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్లేయర్స్ లో ఒకటిగా నిలిచింది. తర్వాత ఓలా ఎలక్ట్రిక్ ఉంది. ఒకప్పుడు ఈవీ లీడర్‌గా కొనసాగిన ఈ సంస్థ ప్రస్తుతం ర్యాంకింగ్స్ లో పడిపోయింది. అయినప్పటికీ మార్కెట్ లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది.
భారత్ లో 2025లోనే 1.27 మిలియన్లకు పైగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడు అయ్యాయి. 100,000 యూనిట్లకు పైగా నెలవారీ డిస్పాచ్‌లు జరిగాయి. ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోల్చితే, ఇండియాలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. అమెరికా, యూరప్‌లోని చాలా ప్రాంతాల మాదిరిగా కాకుండా, భారత్ లో రోజు వారీ అవసరాల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
భారత్ లో పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడు అవుతున్నా, చైనా ఇప్పటికీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనా అమ్మకాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. కానీ, భారత్ ఇప్పుడు మరింత దూకుడుగా ముందుకు వెళ్తోంది. అతి పెద్ద టేకావే స్పష్టంగా కనిపిస్తుంది. దేశ ప్రజలంతా ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మోటార్ సైకిల్స్ కంపెనీలు, తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. త్వరలోనే చైనాను భారత్ దాటివేసే అవకాశం కనిపిస్తోంది.
Read Also: మార్కెట్ లోకి బజాజ్ చేతక్ C25.. ఏథర్ రిజ్టా, TVS iQube, Ola S1 Xతో పోల్చితే బెస్టా? కాదా?