E-Paper
Advertisement

Harish shankar: నా దృష్టిలో ఆయన దేవుడు.. ఆ హీరో పై హరీష్ శంకర్ కామెంట్స్.. పవన్ మాత్రం కాదండోయ్!

Harish shankar: నా దృష్టిలో ఆయన దేవుడు.. ఆ హీరో పై హరీష్ శంకర్ కామెంట్స్.. పవన్ మాత్రం కాదండోయ్!
Advertisement

Harish shankar: హరీష్ శంకర్ పరిచయం అవసరం లేని పేరు. దర్శకుడుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈయన దర్శకత్వంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ సినిమా మార్చి 19వ తేదీ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో డైరెక్టర్ వరుస ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన హీరో రవితేజ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నా దృష్టిలో రవితేజ దేవుడు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి మంచి సక్సెస్ అందుకున్న రవితేజ కొత్తవారిని ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే హరీష్ శంకర్ కూడా మాట్లాడుతూ నా దృష్టిలో రవితేజ కేవలం హీరో మాత్రమే కాదని ఆయన నాకు దేవుడితో సమానమని తెలిపారు. ఆయన నాకు పెద్దన్నయ్యతో సమానం నాపై నాకున్న నమ్మకం కంటే నాపట్ల రవితేజ గారికి ఉన్న నమ్మకం ఎక్కువ అని తెలిపారు. దర్శకుడిగా హరీష్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో రవితేజ తనకు మొట్టమొదటి సినిమా అవకాశాన్ని కల్పించారు.

రవితేజ షాక్ సినిమాకు దర్శకుడిగా..

Advertisement

రవితేజ జ్యోతిక హీరో హీరోయిన్లుగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన షాక్ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడిగా పనిచేస్తూ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు .ఇది ఆయనకు మొదటి సినిమా కావటం విశేషం. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు. అదేవిధంగా రవితేజతో కలిసి మిరపకాయ్, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు చేశారు. మిరపకాయ్ పరవాలేదు అనిపించుకున్న మిస్టర్ బచ్చన్ మాత్రం నిరాశపరిచింది. అయితే త్వరలోనే కచ్చితంగా రవితేజతో తన సినిమా ఉంటుందని హరీష్ శంకర్ పలు సందర్భాలలో తెలిపారు.

గబ్బర్ సింగ్ సక్సెస్ రిపీట్ అయ్యేనా?

Advertisement

ఇలా తనకు ఇండస్ట్రీలో జీవితాన్ని ప్రసాదించిన రవితేజ తన దృష్టిలో హీరో మాత్రమే కాదు దేవుడు అంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇందులో శ్రీ లీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు .దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో, మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేసాయి. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా అదే స్థాయిలో సక్సెస్ అందుకుంటుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: Susmitha Konidela: మేం ఏడిస్తే ఆయనకు ఎంటర్టైన్మెంట్..బాబాయ్ తో బాండింగ్ పై సుస్మిత కామెంట్స్

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×