E-Paper
Advertisement

Susmitha Konidela: మేం ఏడిస్తే ఆయనకు ఎంటర్టైన్మెంట్..బాబాయ్ తో బాండింగ్ పై సుస్మిత కామెంట్స్

Susmitha Konidela: మేం ఏడిస్తే ఆయనకు ఎంటర్టైన్మెంట్..బాబాయ్ తో బాండింగ్ పై సుస్మిత కామెంట్స్
Advertisement

Susmitha Konidela: సుస్మిత కొణిదెల చిరంజీవి పెద్ద కుమార్తెగా, నిర్మాతగా అందరికీ ఎంతో సుపరిచితమే. ఈమె గత కొంతకాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇన్ని రోజులు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్న సుస్మిత ఇటీవల నిర్మాతగా మారిపోయారు. ఇన్ని రోజులు వెబ్ సిరీస్ లను నిర్మించిన ఈమె మొదటిసారి తన తండ్రి చిరంజీవితో కలిసి మన శంకర్ వరప్రసాద్ గారు అని సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. మొదటి సినిమానే బ్లాక్ బాస్టర్ హిట్ కావడం విశేషం. ప్రస్తుతం తదుపరి సినిమాలపై సుస్మిత పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఎంతో బిజీగా ఉన్నారు.

బాబాయ్ కాదు అన్నయ్య..

ఉమెన్స్ డే సందర్భంగా సుస్మిత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఫ్యామిలీకి సంబంధించిన అంశాల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో బాబాయికి తనతో ఉన్న బాండింగ్ గురించి సుస్మిత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక మాటలో చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారు తనకు బాబాయ్ కాదు ఒక పెద్దన్నయ్యతో సమానమని తెలిపారు. చిన్నప్పుడు మమ్మల్ని బాగా ఏడిపించేవాడు మేము ఏడిస్తే బాబాయికు ఎంటర్టైన్మెంట్ అంటూ సుస్మిత తెలిపారు. బాబాయ్ హర్రర్ స్టోరీలు చెబుతూ మమ్మల్ని భయపెట్టేవారు. చరణ్ నిహారిక తెగ భయపడేవారు కానీ నాకు మాత్రం హర్రర్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం కావడంతో వినేదాన్ని అంటూ తెలిపారు.

బాబాయ్ ట్రెండ్ ఫాలో అవ్వరు.. సెట్ చేస్తారు..

Advertisement

బాబాయ్ కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అప్పట్లోనే మ్యూజిక్ కి సంబంధించిన క్యాసెట్లన్నీ తెప్పించుకునేవారని, ముఖ్యంగా ది గాడ్ ఫాద‌ర్, స్టార్ వార్స్ లాంటి సినిమాలను ఆయనే మాకు పరిచయం చేశారని సుస్మిత తెలిపారు. సుస్మిత రామ్ చరణ్ చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు కానీ పవన్ కళ్యాణ్ కు చేయలేదు అలా చేయకపోవడానికి కారణం ఏంటనే ప్రశ్న ఎదురైంది. బాబాయ్ ఏ సినిమాకు ఏది వేసుకుంటారో అదే ట్రెండ్ అవుతుందని, ఆయన ట్రెండ్ ఫాలో అవ్వరు ట్రెండ్ సెట్ చేస్తారని సుస్మిత తెలిపారు.

తన మూలాలను మర్చిపోలేదు..

Advertisement

ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా విజయం సాధించి ఇంటికి రావడంతో చిరంజీవి ఘనంగా సెలబ్రేషన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈయన వచ్చి రావడంతోనే చిరంజీవి దంపతులకు నమస్కారం చేశారు. ఆ విషయంపై సుస్మితకు ప్రశ్న ఎదురవడంతో ఆ క్షణం నాన్న చాలా సంతోషపడ్డారని చాలా గర్వంగా ఉన్నారని మా అందరికీ అదొక ఎమోషనల్ మూమెంట్ అంటూ పవన్ విజయం గురించి మాట్లాడారు అయితే ఆయన ఎన్ని ఇబ్బందులు పడిన ఎంత మంచి స్థాయికి వెళ్లిన తన మూలాలను మాత్రం మర్చిపోలేదు అంటూ సుస్మిత తన బాబాయ్ తో బాండింగ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: Vijay Rashmika: రష్మికకు కానుకగా 90 కోట్ల విల్లా.. అసలు విషయం చెప్పిన విజయ్ మేనమామ!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×