E-Paper
Advertisement

Tips For Water Bottle: వాటర్ బాటిల్ క్లీనింగ్.. ఇలా చేస్తే జిడ్డు, బ్యాక్టీరియా క్షణాల్లోనే మాయం

Tips For Water Bottle: వాటర్ బాటిల్ క్లీనింగ్.. ఇలా చేస్తే జిడ్డు, బ్యాక్టీరియా క్షణాల్లోనే మాయం
Advertisement

Tips For Water Bottle: మనం రోజూ ఆరోగ్యంగా ఉండటానికి తగినంత నీరు తాగుతుంటాం. అయితే ఇందుకోసం ప్లాస్టిక్, స్టీల్ లేదా గాజు బాటిళ్లను ఉపయోగిస్తాం. అయితే.. బాటిల్‌ను కేవలం నీటితో కడగడం వల్ల అది పూర్తిగా శుభ్రం కాదు. ఇదిలా ఉంటే.. కాలక్రమేణా బాటిల్ అడుగున బ్యాక్టీరియా, నాచు, చెడు వాసన చేరతాయి. ఇది మన ఆరోగ్యానికి ప్రమాదకరం. కాబట్టి.. వాటర్ బాటిల్‌ను ఎలా శుభ్రం చేయాలి. వీటిని ఎప్పుడూ తాజాగా ఎలా ఉంచుకోవాలి అనే విషయాలను ఈ వివరంగా తెలుసుకుందాం.

బాటిల్ క్లీనింగ్ టిప్స్:
మనం నిరంతరం వాడే వాటర్ బాటిళ్లలో తేమ కారణంగా సూక్ష్మజీవులు త్వరగా అభివృద్ధి చెందుతాయి. వీటిని పోగొట్టి.. బాటిల్‌ను కొత్త దానిలా ఉంచడానికి ఈ కింది పద్ధతులు పాటించండి.

Advertisement

1. రోజువారీ శుభ్రత :
ప్రతిరోజూ బాటిల్‌ను వాడిన తర్వాత, అందులో కొంచెం గోరు వెచ్చని నీరు, కొన్ని చుక్కల డిష్ వాషింగ్ లిక్విడ్ వేయాలి. బాటిల్ మూత పెట్టి బాగా ఊపి, బ్రష్ సహాయంతో లోపలి భాగాలను రుద్దాలి. ముఖ్యంగా మూత చుట్టూ ఉండే రబ్బరు రింగులను శుభ్రం చేయడం మర్చిపోవద్దు.

2. వెనిగర్ చిట్కా:
బాటిల్‌లో వింత వాసన వస్తుంటే.. దీనిని తొలగించడానికి తెల్ల వెనిగర్ అద్భుతంగా పనిచేస్తుంది. బాటిల్‌లో సగం వరకు నీరు, మిగిలిన సగం వెనిగర్ నింపండి.
రాత్రంతా అలాగే ఉంచి.. మరుసటి రోజు ఉదయం శుభ్రం చేయండి. ఇది బాటిల్ లోపల పేరుకుపోయిన ఖనిజ లవణాలను అంతే కాకుండా బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

Advertisement

3. మొండి వాసనలు:
చాలా కాలం పాటు బాటిల్ వాడకపోతే లేదా అందులో ఫ్లేవర్డ్ డ్రింక్స్ పోస్తే వచ్చే మొండి వాసనను పోగొట్టడానికి బేకింగ్ సోడా ఉత్తమం. ఇవే కాకుండా రెండు టీస్పూన్ల బేకింగ్ సోడాను బాటిల్‌లో వేసి, కొంచెం నీటితో పేస్ట్‌లా చేయండి. తర్వాత బాటిల్ నిండా నీరు పోసి కొన్ని గంటల పాటు ఉంచండి. ఇది బాటిల్‌లోని దుర్వాసనన చెడు వాసనను పీల్చుకుంటుంది.

4. స్టీల్ బాటిళ్ల కోసం ప్రత్యేక జాగ్రత్తలు:
మీరు ఇన్సులేటెడ్ స్టీల్ బాటిళ్లను వాడుతుంటే.. వాటిని శుభ్రం చేయడానికి బ్లీచ్ లేదా ఘాటైన కెమికల్స్ వాడకండి. ఇవి స్టీల్‌ను తుప్పు పట్టేలా చేస్తాయి. దీనికి బదులుగా బ్రష్‌తో కూడిన సోప్ వాటర్ సరిపోతుంది.

5. మూత, స్ట్రా క్లీనింగ్:
అనేక మంది చేసే తప్పు బాటిల్‌ను కడిగి, మూతను వదిలేయడం. స్ట్రా ఉన్న బాటిల్స్ అయితే.. లోపల సన్నని బ్రష్‌తో శుభ్రం చేయాలి. మూత సందుల్లో తేమ నిలిచిపోయి ఫంగస్ చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని విడదీసి కడగాలి.

Also Read: డీహైడ్రేషన్‌కు చెక్.. సమ్మర్‌లో ఖాళీ కడుపుతో తీసుకోవాల్సిన బెస్ట్ డ్రింక్స్

6. ఎండలో ఆరబెట్టడం:
కడిగిన వెంటనే బాటిల్‌కు మూత పెట్టకండి. తేమ లోపల ఉండిపోతే మళ్లీ వాసన మొదలవుతుంది. బాటిల్‌ను బోర్లించి లేదా గాలి తగిలే చోట పూర్తిగా ఆరిపోయే వరకు ఉంచాలి. సూర్యరశ్మి తగిలితే ఇంకా మంచిది. ఎందుకంటే ఇది సహజంగానే క్రిములను చంపడానికి పని చేస్తుంది.

శరీరానికి నీరు ఎంత అవసరమో.. ఆ నీటిని నిల్వ చేసే పాత్ర కూడా అంతే శుభ్రంగా ఉండాలి. పైన చెప్పిన చిట్కాలను పాటిస్తే.. మీ వాటర్ బాటిల్ ఎప్పుడూ తాజాగా, ఉంటుంది. వారానికి కనీసం ఒకసారి వెనిగర్ లేదా బేకింగ్ సోడాతో డీప్ క్లీనింగ్ చేయడం మర్చిపోకండి.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×