E-Paper
Advertisement

SreeLeela: శ్రీ లీలను గోల్డెన్ లెగ్ గా మార్చేస్తా.. ట్రోలర్స్ కి డైరెక్టర్ కౌంటర్!

SreeLeela: శ్రీ లీలను గోల్డెన్ లెగ్ గా మార్చేస్తా.. ట్రోలర్స్ కి డైరెక్టర్ కౌంటర్!
Advertisement

SreeLeela:ప్రముఖ హీరోయిన్ శ్రీ లీల (Sree Leela) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పేరుకే కన్నడ ముద్దుగుమ్మ అయినప్పటికీ తెలుగులో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ‘పెళ్లి సందD’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె. ఆ తర్వాత రవితేజ (Raviteja) తో ‘ధమాకా’ సినిమా చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఆ తర్వాత నుంచి చాలా సినిమాలలో అవకాశాలు అందుకున్నప్పటికీ సరైన విజయం మాత్రం ఆమె ఖాతాలో చేరలేదు. ముఖ్యంగా ధమాకా తర్వాత అరడజన్ సినిమాల కంటే ఎక్కువే చేసింది. కానీ అందులో ఒకటి కూడా ఈమెకు హిట్ అవ్వలేదు..

ఐరన్ లెగ్ అంటూ శ్రీ లీలపై ట్రోల్స్..

అయితే అలాంటి ఈమె అటు తమిళ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్. దీంతో శ్రీ లీలపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. ఈమెతో సినిమాలు చేస్తే అంతే సంగతులు.. డిజాస్టర్ తప్ప సక్సెస్ చవిచూడరు అనే పరిస్థితి వచ్చేసింది. ఇక ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పుడు అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక మార్చి 19వ తేదీన భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే శ్రీ లీల ఐరన్ లెగ్ సెంటిమెంట్ వల్ల ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందని కొంతమంది నెటిజన్స్ ట్రోల్స్ చేస్తుంటే.. ఈమెకు మద్దతుగా హరీష్ శంకర్ కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ALSO READ:Priyanka Chopra: ఆ క్షణం మర్చిపోలేనిది.. అవకాశం కొందరికే లభిస్తుంది అంటూ!

ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్..

తాజాగా దీనిపై హరీష్ శంకర్ మాట్లాడుతూ..” నేను గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా చూస్తున్నాను. చాలామంది శ్రీలీలను ఐరన్ లెగ్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెబుతున్నా.. ఇంతకాలం డాన్స్ చేసే శ్రీలీలను మాత్రమే మీరు చూసి ఉంటారు. ఇందులో డాన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో కూడా ఆమె అదరగొట్టేసింది. ఈ సినిమా నుంచి ఆమె ఐరన్ లెగ్ కాదు గోల్డెన్ లెగ్ అవుతుంది. ఇకపై అందరూ గోల్డెన్ లెగ్ శ్రీ లీల అంటారు” అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. మొత్తానికైతే దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. శ్రీలీలకు అండగా ఆయన చేసిన కామెంట్లు చూసి శ్రీలీల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ హరీష్ శంకర్ కామెంట్స్ ను వైరల్ చేస్తున్నారు. మరి హరీష్ శంకర్ ధీమా వ్యక్తం చేస్తూ గోల్డెన్ లెగ్ అనిపిస్తానని మాట ఇచ్చారు. మరి ఏ మేరకు ఈ సినిమా విజయం సాధించి, శ్రీలీలకు హరీష్ చేసిన హామీ నెరవేరుతుందేమో చూడాలి.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×