Priyanka Chopra:ప్రముఖ గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు తమిళ్ ఇండస్ట్రీ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత బాలీవుడ్లో సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.. అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా కూడా పేరు సంపాదించుకుంది. అలాంటి ఈమె బాలీవుడ్ లో కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో హాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడే కొన్ని సంవత్సరాలు పాటు పోరాడి ఇప్పుడు అక్కడ స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది.
ఇకపోతే హాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు సినిమాలు చేస్తూ గ్లోబల్ ఇమేజ్ దక్కించుకున్న ప్రియాంక చోప్రా.. నేడు ఒక్కో చిత్రానికి రూ.45 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ రికార్డ్ సృష్టించింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో మహేష్ బాబు(Maheshbabu ) హీరోగా వస్తున్న ‘వారణాసి’ సినిమాలో మందాకిని పాత్రలో హీరోయిన్ గా లీడ్ రోల్ పోషిస్తుంది. యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా మైథాలజికల్ టచ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా టైం ట్రావెల్ గా కూడా ఉండనుంది అంటూ గతంలో సినిమాపై ప్రియాంక చోప్రా అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా సినిమా షూటింగ్ సెట్లో తాను అనుభవించిన మధురమైన క్షణాలను అభిమానులతో పంచుకుంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. “కెన్యా అడవుల్లో గడిపిన క్షణాలు మధురమైనవి. ముఖ్యంగా వేల సంఖ్యలో వైల్డ్ బీస్ట్స్ మధ్య షూటింగ్ చేయడం అనేది ఒక అద్భుతమైన అనుభూతి. ప్రకృతి గొప్పతనం నాకు అప్పుడు అర్థమయింది” అంటూ ఆమె తెలిపింది. గత సెప్టెంబర్ లో జరిగిన ఈ షూటింగు తన జీవితంలో మర్చిపోలేనిదని రాజమౌళి కూడా ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. అలా మొత్తానికి అయితే ప్రియాంక చోప్రా సినిమాపై అంచనాలు పెంచుతూనే సినిమా గురించి పలు కీలక వ్యాఖ్యలు చేసి ఆకట్టుకుంది. అలాగే సినిమా షూటింగ్ సెట్లో తనకు ఎన్నో మరుపురాని అనుభూతులు లభించాయని చెప్పి అభిమానులను సైతం సర్ప్రైజ్ చేసింది.
ALSO READ:HBD Sharwanand : శర్వానంద్ బర్తడే స్పెషల్.. అభిమానులకు డబుల్ ట్రీట్!
ప్రియాంక చోప్రా విషయానికి వస్తే.. మిస్ వరల్డ్ 2000 లో విజేతగా నిలిచి కిరీటాన్ని దక్కించుకున్న ఈమె.. తన అద్భుతమైన నటనతో రెండు నేషనల్ అవార్డులు, ఐదు ఫిలిం ఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది. 2016లో భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకున్న ఈమె జాబితాలో ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళలలో ఒకరిగా స్థానం సంపాదించుకుంది. అలాగే బీబీసీ 100 ఉమెన్స్ లిస్ట్ లో కూడా స్థానం సంపాదించుకుంది. జార్ఖండ్ కి చెందిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలు చేస్తూనే ఇటు తెలుగు చిత్రాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయింది. ఇక వారణాసి సినిమాతో తన గ్లోబల్ మార్కెట్ ను మరింత విస్తృతం చేసుకోబోతోంది ఈ ముద్దుగుమ్మ.