E-Paper
Advertisement

Xiaomi Price Hike: షావోమి, రెడ్‌మి, పోకో ఫోన్ ధరలు త్వరలోనే పెంపు.. ఇప్పుడే కొనేయండి

Xiaomi Price Hike: షావోమి, రెడ్‌మి, పోకో ఫోన్ ధరలు త్వరలోనే పెంపు.. ఇప్పుడే కొనేయండి
Advertisement

Xiaomi Price Hike| ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ ఇప్పుడు పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. మెమరీ చిప్‌ల ధరలు గత కొన్ని నెలల్లో గణనీయంగా పెరిగాయి. ఈ ధర పెరుగుదల వల్ల స్మార్ట్‌ఫోన్ల తయారీ ఖర్చు పెరిగింది. చైనీస్ టెక్ కంపెనీ షావోమీ ఇటీవల ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించింది. భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉందని సూచించింది. షామోమీ CEO లీ జున్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వివరించాడు. కాంపోనెంట్ల ధరలు పెరిగితే ఫోన్ల ధరలు ప్రభావితమవుతాయని ఆయన అన్నారు. అయితే కస్టమర్లపై పెద్ద భారం పడకుండా చూస్తామని చెప్పారు.

మెమరీ చిప్‌ల ధరలు ఎందుకు పెరిగాయి?

మెమరీ చిప్‌ల ధరలు పెరగడానికి ప్రధాన కారణం AI టెక్నాలజీ వేగంగా పెరగడం. ప్రపంచవ్యాప్తంగా AI సర్వర్లు, డేటా సెంటర్లు, హై-పెర్ఫామెన్స్ మెషిన్లకు అడ్వాన్స్ మెమరీ చిప్‌ల అవసరం పెరిగింది. డిమాండ్ సప్లై కంటే ఎక్కువగా ఉండటం వల్ల ధరలు గణనీయంగా పెరిగాయి. స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఈ చిప్‌లపై ఎక్కువగా ఆధారపడతారు. ఈ ధర పెరుగుదల వల్ల తయారీ ఖర్చు పెరిగింది.

షావోమీ ఫోన్ల ధరలపై ప్రభావం

Advertisement

షావోమీ సిఈవో ప్రకారం.. మెమరీ చిప్‌లు స్మార్ట్‌ఫోన్‌లో అత్యంత ఖరీదైన కాంపోనెంట్లలో ఒకటి. ప్రతి ఆధునిక ఫోన్‌లో RAM, స్టోరేజ్ చిప్‌లు ఉంటాయి. మెమరీ ధరలు పెరిగితే.. స్మార్ట్‌ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌ల మొత్తం తయారీ ఖర్చు పెరుగుతుంది. షావోమి లాంటి ఫోన్ తయారీ కంపెనీల వ్యాపారంపై ప్రభావం చూపుతుంది.

ఖర్చులను నియంత్రించడానికి షావోమి వ్యూహాలు

మొత్తం ధర పెరుగుదల భారం కస్టమర్లపై పూర్తిగా మోపకూడదని భావిస్తోంది. సప్లై చైన్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. కాంపోనెంట్ సప్లయర్లతో మెరుగైన భాగస్వామ్యాలు చేసి ధరలను స్థిరంగా ఉంచాలని ప్రయత్నిస్తోంది. ఉత్పత్తి నిర్వహణను మెరుగుపరచడం ద్వారా అనవసర ఖర్చులను తగ్గిస్తామని, సప్లయర్లతో ధరల ఒప్పందాలు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు షావోమీ తెలిపింది. ధర మార్పులు జాగ్రత్తగా, కస్టమర్లపై తక్కువ ప్రభావంతో ఉండేలా చూస్తుంది.

సమస్య ఎదుర్కొంటున్న అన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు

Advertisement

మెమరీ చిప్ ధరల పెరుగుదల మొత్తం కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను ప్రభావితం చేస్తోంది. చాలా బ్రాండ్లు ఇదే సప్లై చైన్‌పై ఆధారపడ్డాయి. కొన్ని కంపెనీలు లాభాలపై ఒత్తిడి గురించి ఇప్పటికే నివేదించాయి. కొత్త డివైస్‌ల లాంచ్‌లను ఆలస్యం చేసే అవకాశం ఉంది. చౌక స్మార్ట్‌ఫోన్లు తయారీ ఖర్చు పెరిగినప్పుడు రావడం కష్టమవుతుంది. భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎంట్రీ-లెవల్ ఫోన్లపై ఎక్కువ ప్రభావం పడవచ్చు.

Also Read: వాట్సాప్‌లో యాడ్స్‌తొ విసిగిపోతున్నారా? ఇలా బ్లాక్ చేయండి

షావోమీ ఫోన్లు ఇప్పుడే కొనయేండి

ధరలు పెంచినా కస్టమర్లకు మంచి వాల్యూ ఇస్తామని షావోమీ హామీ ఇచ్చింది. మార్కెట్‌లో పోటీపడేలా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. అఫర్డబుల్ ధరలు, అడ్వాన్స్ టెక్నాలజీ రెండూ బ్యాలెన్స్ చేస్తుంది. ధరల పెరుగుదల త్వరలోనే ఉండవచ్చు. అందుకే షావోమి బ్రాండ్‌లైన్ రెడ్‌మి, పోకో ఫోన్స్ కొనాలనుకునేవారు త్వరగా కొనడం మంచిది. కాంపోనెంట్ ధరలు పెరిగితే ఫోన్ల ధరలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది.

Related News

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×