Allu Arjun -Lokesh Kanagaraj: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) త్వరలోనే టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తో సినిమా చేయబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం దర్శకుడిగా హీరోగా ఎంతో బిజీగా ఉన్న లోకేష్ ఒక అద్భుతమైన సూపర్ హీరో కథను అల్లు అర్జున్ కు చెప్పినట్టు సమాచారం. “ఇరుంబుకై మాయావి”(irumbukai mayavi)అనే స్టోరీను నెరేట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ తరహా సినిమాలు ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాలేదని తెలుస్తోంది.
గత కొన్ని సంవత్సరాలుగా ఈ కథ పట్ల పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయట. అయితే ముందుగా లోకేష్ ఈ సినిమా కథతో కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను సంప్రదించారట అయితే సూర్య ఈ కథను రిజెక్ట్ చేసిన నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ వద్దకు వెళ్ళింది. ఇక అమీర్ ఖాన్ కూడా రిజెక్ట్ చేయడంతో ఈ కథను మరింత డెవలప్ చేసి అనంతరం లోకేష్ అల్లు అర్జున్ కు వివరించడంతో అల్లు అర్జున్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమా 1962 DC కామిక్ ది స్టీల్ క్లా నుండి ప్రేరణ పొందిన సూపర్ హీరో కథ.
ఈ సినిమాలో హీరో తన కుడి చేయిని కోల్పోగా
స్టీల్ ప్రొస్థెటిక్ పొందిన వ్యక్తి చుట్టూ ఈ సినిమా కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ కథలో హీరోకి విద్యుత్ షాక్ షాక్ తగలడంతో, అతనిలో సూపర్ పవర్స్ ఉంటాయని , ఈ పవర్ ద్వారా మనిషి అదృశ్యం అయిన తన మెటల్ తో చేసిన చెయ్యి మాత్రమే కనిపిస్తుందని తెలుస్తుంది. ఇలా విభిన్నమైన సూపర్ కాన్సెప్ట్, సూపర్ హీరో కథ ద్వారా అల్లు అర్జున్ తో సినిమా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారని తెలుస్తోంది.
హీరోగా లోకేష్ DC మూవీ…
ఇలా సూపర్ హీరో కాన్సెప్ట్ ద్వారా అల్లు అర్జున్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే విషయం తెలిసిన అభిమానులు కూడా ఈ సినిమాపై ఎంతో ఆసక్తి చూపెడుతున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ సినిమా అనంతరం లోకేష్ కనగరాజ్ తో సినిమా చేస్తారా? లేదంటే పుష్ప 3 పూర్తి అయిన అనంతరం ఈ ప్రాజెక్టు మొదలవుతుందా? అనే విషయాలపై త్వరలోనే అధికారక ప్రకటన రానుంది. ఇక లోకేష్ మరోవైపు హీరోగా కూడా ఓ సినిమాలో చేస్తున్న సంగతి తెలిసినదే. ప్రస్తుతం ఈయన DC అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే అల్లు అర్జున్ పనులలో బిజీ కానున్నారు.
Also Read: Lenin Movie: రీ షూట్ పనులలో అఖిల్ లెనిన్… వాలెంటైన్స్ డే టార్గెట్!