E-Paper
Advertisement

Maruthi: రాజా సాబ్‌ మూవీని రెండో సారి చూడండి… అభిమానులకు డైరెక్టర్ మారుతి సూచన

Maruthi: రాజా సాబ్‌ మూవీని రెండో సారి చూడండి… అభిమానులకు డైరెక్టర్ మారుతి సూచన
Advertisement

Maruthi: టాలీవుడ్ డైరెక్టర్ మారుతి (Maruthi)తాజాగా ప్రభాస్ తో కలిసి ది రాజా సాబ్(The Rajassab) సినిమా చేసిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలు నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది దీంతో ప్రభాస్ అభిమానులు డైరెక్టర్ మారుతి పై పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం వస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా సినిమా చేయటంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మారుతి ఈ విమర్శలపై స్పందించారు.

సినిమా లోతు అర్థం చేసుకోలేకపోతున్నారు..

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతి రాజా సాబ్ సినిమా గురించి వస్తున్న రూమర్లపై స్పందిస్తూ.. నా మూడు సంవత్సరాల కష్టాన్ని మూడు గంటలలో సినిమా చూసి విమర్శలు కురిపిస్తున్నారని, త్వరలోనే వాళ్లే అసలు విషయాన్ని గ్రహిస్తారని మారుతి తెలియజేశారు. ఈ సినిమాలో ఉన్న లోతు అర్థం కావాలి అంటే ఒకసారి చూడటం కాదు, రెండోసారి సినిమా చూసినప్పుడు స్పష్టం అవుతుందని అందుకే మళ్ళీ థియేటర్ కు వచ్చి ఈ సినిమాని చూడండి అంటూ మారుతి ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు సంక్రాంతి సినిమాల హడావిడిలో ఉన్నారు.

తాను శాపనార్థాలు పెట్టలేదు..

Advertisement

ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాను అర్థం చేసుకోలేకపోతున్నారని మారుతి తెలియజేశారు . ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా కాకుండా మరోసారి విడుదల అయ్యి ఉంటే కచ్చితంగా ఈ సినిమా రిజల్ట్ మరోలా ఉండేదని ఈయన తెలియచేశారు. తన సినిమా గురించి విమర్శలు చేసిన వారి పట్ల తాను శపించడం లేదని, వారి విమర్శలకు బాధపడుతున్నానని మారుతి తెలిపారు. ప్రభాస్ తో చేసిన ఈ సినిమా విషయంలో సరైన కంటెంట్ లేకపోయినప్పటికీ మారుతి మాత్రం సినిమాలో లోతు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటూ మాట్లాడటంతో మరోసారి ప్రభాస్ అభిమానులు విమర్శలు కురిపిస్తున్నారు.

సీక్వెల్ ఉంటుందా?

Advertisement

ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరో సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలై నాలుగు రోజులకు గాను కేవలం 200 కోట్ల కలెక్షన్లు రాబట్టడం గమనార్హం. ఇటీవల కాలంలో ప్రభాస్ సినిమాలకు అత్యంత తక్కువ కలెక్షన్లను రాబట్టిన సినిమా ఇదే అంటూ అభిమానులు మారుతి పై ఫైర్ అవుతున్నారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందని క్లైమాక్స్ లో స్పష్టం చేశారు. మరి ఈ సినిమా రిజల్ట్ అనంతరం మారుతి సీక్వెల్ సినిమా చేస్తారా? అందుకు ప్రభాస్ ఒప్పుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా సాధించే కలెక్షన్లను బట్టి సీక్వెల్ ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా వరుస సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమాల ప్రభావం రాజా సాబ్ కలెక్షన్ల పై పడిందని చెప్పాలి.

Also Read: MSVPG film: శంకర్ వరప్రసాద్ సినిమాలో చిరు కొడుకుగా నటించింది అబ్బాయి కాదా?అమ్మాయా?

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×