E-Paper
Advertisement

T20 World Cup 2026: పాకిస్తాన్ మూలాలు…4 గురు USA ప్లేయ‌ర్ల వీసాలు రిజెక్ట్ చేసిన ఇండియా

T20 World Cup 2026: పాకిస్తాన్ మూలాలు…4 గురు USA ప్లేయ‌ర్ల వీసాలు రిజెక్ట్ చేసిన ఇండియా
Advertisement

T20 World Cup 2026:   టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్  ( T20 World Cup 2026) నేపథ్యంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టుకు ( United States of America ) ఊహించని షాక్ తగిలింది. ఎన్నో ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో అర్హత సాధించిన ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టు ప్లేయర్లకు పాకిస్తాన్ గండంగా మారింది. పాకిస్తాన్ లో పుట్టిన కొంత మంది ప్లేయర్లు ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టుకు ఆడుతున్నారు. పాకిస్తాన్ లో జన్మించిన‌ అలీ ఖాన్ తో ( Ali khan) పాటు మరో ముగ్గురు క్రికెటర్లకు వీసాలు ( USA Vissa) ఇవ్వకుండా రిజెక్ట్ చేసింది భారత సర్కార్. వచ్చే నెలలో టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఇండియాలో జరగనుంది. ఈ నేపథ్యంలో వీసాల కోసం అప్లై చేసుకుంటే ఈ నలుగురు యూఎస్ఏ ప్లేయర్ల వీసాలను రిజెక్ట్ చేసింది మోడీ ప్రభుత్వం. దీంతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ( USA Team) జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.

Also Read: BPL: చ‌రిత్ర‌లో తొలిసారి.. ఒకే మ్యాచ్ లో తండ్రి, కొడుకులు..ముస్తాఫిజుర్ మెంటెలోడు అంటూ ప‌రువు తీసిన‌ న‌బీ

నలుగురు యూఎస్ఏ ప్లేయర్ల వీసా రద్దు చేసిన ఇండియా

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026)  ఇండియాతో పాటు శ్రీలంకలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇండియా అలాగే శ్రీలంక సంయుక్తంగా ఈ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నాయి. అయితే మెజారిటీ మ్యాచ్ లన్ని ఇండియాలోనే జరగబోతున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరాను అయింది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ జరగనుంది. అయితే చాలా రోజుల తర్వాత టీ20 ప్రపంచ కప్ 2026లో అర్హత సాధించిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టు సభ్యులు, ఇండియాకు వచ్చేందుకు గాను వీసాలు అప్లై చేసుకున్నారు.

అయితే ఈ నేపథ్యంలో యూఎస్ఏ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. యూఎస్ఏ జట్టుకు సంబంధించిన ఫాస్ట్ బౌలర్ అలీ ఖాన్ తో పాటు మరో ముగ్గురు వీసాలు రద్దు చేసింది ఇండియన్ సర్కార్. యూఎస్ఏ జట్టుకు ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ అలీ ఖాన్, షయాన్ జహంగీర్, ఎహ్సాన్ ఆదిల్, మొహమ్మద్ మొహ్సిన్  ప్లేయర్ల వీసాలు రద్దు చేసింది ఇండియన్ సర్కార్. ఈ నలుగురు ప్లేయర్లకు పాకిస్తాన్ మూలాలు ఉన్నాయి. ఈ న‌లుగురు ప్లేయ‌ర్లు, పాకిస్తాన్ లో జన్మించి ఆ తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యారు. ప్రస్తుతం USA జట్టుకు ఆడుతున్న‌ప్పటికీ పాకిస్తాన్ మూలాలు ఉన్న నేపథ్యంలో ఇండియన్ ప్రభుత్వం వీసాలు ఇవ్వకుండా రద్దు చేసింది.

వీసాలు రిజెక్ట్ అయిన ప్లేయ‌ర్లు వీళ్లే
1) అలీ ఖాన్
2) ఎహ్సాన్ ఆదిల్
3) షయాన్ జహంగీర్
4) మొహమ్మద్ మొహ్సిన్

Advertisement

Also Read: Virat Kohli Century: కోహ్లీ ఫ్యాన్స్ అంద‌రూ ఫేక్ గాళ్లే..సెంచ‌రీ చేయ‌క‌పోతే అన్నమే తిన‌ను అన్నాడు, ఔట్ అయ్యాక లాగించేశాడు

 

 

 

Related News

వైభ‌వ్ సూర్య‌వంశీ మాములోడు కాదు.. లిఫ్ట్ లోనే అమ్మాయితో రొమాన్స్ ?

మ‌రో అమ్మాయితో శ్రేయాస్ అయ్య‌ర్ రిలేష‌న్‌..షాకింగ్ వీడియో వైర‌ల్

ఫైన‌ల్స్ లో చివ‌రి ఓవ‌ర్ వేయాల‌ని ధోని టార్చ‌ర్ చేశాడు

బీసీసీఐ డ‌బ్బుల‌తో కులుకుతూ, లండ‌న్ జ‌ల్సాలు..కోహ్లీపై కైఫ్ సీరియ‌స్‌

పాక్ డ్రెస్సింగ్ రూంలో టీమిండియా క్రికెట‌ర్లు న‌మాజ్ చేసేవాళ్లు !

ఆసియా క‌ప్ ఫైన‌ల్స్ లో టీమిండియాకు న‌ర‌కం చూపిస్తాం..రియాజ్ హెచ్చ‌రిక‌

క్రికెట్ ఆడటం చేతకాదా ? అంటూ నన్ను సచిన్ అవమానించాడు

CSKను నాశ‌నం చేసింది ధోనినే…అత‌న్ని గెంటేయండి !

Big Stories

Advertisement
×