E-Paper
Advertisement

Samantha -Raj Nidimoru: తెలుగింటి కోడలుగా సమంత.. రాజ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇదే!

Samantha -Raj Nidimoru: తెలుగింటి కోడలుగా సమంత.. రాజ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇదే!
Advertisement

Samantha -Raj Nidimoru : సినీ నటి సమంత అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. గత కొంతకాలంగా ఈమె రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వచ్చినా, ఎక్కడ కూడా ఈ వార్తలపై స్పందించలేదు కనీసం ఈమె పెళ్లి గురించి ఎలాంటి అధికారక ప్రకటన లేకుండా పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సమంత పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇలా సమంత రాజ్ వివాహం చేసుకున్నారని విషయం తెలియడంతో డైరెక్టర్ రాజ్ కు సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజ్ కుటుంబ నేపథ్యం గురించి ఆయన సినీ కెరియర్ గురించి ఎన్నో విషయాలు చక్కర్లు కొడుతున్నాయి.

తిరుపతి జిల్లాలో జన్మించిన రాజ్..

రాజ్ ను సమంత రెండవ వివాహం చేసుకొని తెలుగు ఇంటి కోడలుగా అడుగు పెట్టారని తెలుస్తుంది. రాజ్ నిడిమోరు ఆంధ్రప్రదేశ్ , తిరుపతి జిల్లాకు చెందిన వ్యక్తి కావటం విశేషం. రాజ్ తండ్రి పేరు కృష్ణ నిడిమోరు తల్లి రమా నిడిమోరు. వృత్తిపరంగా రాజ్ తండ్రి వ్యాపార వేత్త కావటం విశేషం. కృష్ణ, రమా దంపతులకు రాజ్ ఆగస్టు 4 1975 వ సంవత్సరంలో జన్మించారు. ఇలా తిరుపతిలో జన్మించడంతో ఈయన విద్యాభ్యాసం మొత్తం తిరుపతి జిల్లాలలోనే పూర్తి అయ్యింది. రాజ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేసి అనంతరం యుఎస్ఏ లో ఉద్యోగం చేశారు.

మొదటి భార్యకు విడాకులు..

Advertisement

ఇలా యూఎస్ఏ లో ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలోనే ఈయన సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. తన స్నేహితుడు డీకేతో కలిసి దర్శకులుగా వీరిద్దరూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. రాజు 2002వ సంవత్సరంలో “షాదీ. కామ్” అనే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన 2015 లో శ్యామాలి దే అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈమె అసిస్టెంట్ డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్, ఆమె రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా మరియు విశాల్ భరద్వాజ్ వంటి దర్శకుల వద్ద పనిచేశారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. ఇక వీరిద్దరూ కొన్ని కారణాలవల్ల 2022వ సంవత్సరంలో విడాకులు తీసుకొని విడిపోయారు.

ది ఫ్యామిలీ మెన్ 2..

Advertisement

ఇలా తన భార్య నుంచి విడాకులు తీసుకున్న రాజ్ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే ఈయన ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ ఎంతో మంచి సక్సెస్ కావడంతో తదుపరి రెండవ సీజన్ కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సీజన్ 2 లో సమంత రాజీ అనే పాత్రలో నటించారు.ఇలా సమంతతో ది ఫ్యామిలీ మెన్ 2 సమయంలో మంచి పరిచయం ఏర్పడింది. అదే సమయంలోనే సమంత కూడా నాగచైతన్య నుంచి విడాకులు తీసుకొని విడిపోవడంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడమే కాకుండా ఇద్దరు రిలేషన్ లో ఉన్నారనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ రెండవ వివాహం చేసుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయంపై అధికారక ప్రకటన రావడమే ఆలస్యం.

Also Read: Samantha Marriage : బిగ్ బ్రేకింగ్ : కాసేపటి క్రితం సమంత రెండో పెళ్లి అయిపోయింది?

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×