E-Paper
Advertisement

Samantha Marriage : బిగ్ బ్రేకింగ్ : కాసేపటి క్రితం సమంత రెండో పెళ్లి అయిపోయింది?

Samantha Marriage : బిగ్ బ్రేకింగ్ : కాసేపటి క్రితం సమంత రెండో పెళ్లి అయిపోయింది?
Advertisement

Samantha Marriage: సినీనటి సమంత (Samantha) అందరూ అనుకున్న విధంగానే రెండోసారి తన వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. గత కొంతకాలంగా ఈమె డైరెక్టర్ రాజ్ నిడుమోరు(Raj Nidumoru)తో రిలేషన్ లో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు బయటకు వచ్చినప్పటికీ ఈ వార్తలపై ఎక్కడ స్పందించలేదు. ఇలా వీరి రిలేషన్ గురించి ఎన్ని వార్తలు వచ్చిన మౌనంగా ఉన్న సమంత తాజాగా పెళ్లి చేసుకున అందరికీ షాక్ ఇచ్చారు. ఈమె నేడు పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విధంగానే డైరెక్టర్ రాజ్ తో కలిసి నేడు ఉదయం కోయబత్తూరులోని ఈషా యోగ సెంటర్లోని లింగ బైరవి ఆలయంలో వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఎరుపు రంగు చీరలో సమంత..

నేడు ఉదయం వీరి వివాహం జరిగినట్టు సమాచారం. అది కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహపు వేడుక జరిగిందని తెలుస్తుంది. ఈ వేడుకలో భాగంగా డైరెక్టర్ నందిని రెడ్డితో పాటు సమంత క్లోజ్ ఫ్రెండ్స్ కూడా హాజరయ్యారని సమాచారం. ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా సమంత ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న ఎరుపు రంగు చీరను ధరించినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు కానీ, వీడియోలు కానీ ఎక్కడ బయటకు రాలేదు. ఈ పెళ్లి విషయం గురించి సమంత నేడు సాయంత్రం అధికారికంగా వెల్లడించబోతున్నట్టు సమాచారం. ఇలా సమంత వివాహం జరిగిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇద్దరికీ రెండవ వివాహం…

Advertisement

ఇకపోతే సమంతకు డైరెక్టర్ రాజ్ ఇద్దరికీ ఇది రెండవ వివాహం అనే సంగతి తెలిసిందే. సమంత ఇది వరకు నటుడు నాగచైతన్యను వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా సమంత నుంచి విడిపోయిన నాగచైతన్య గత ఏడాది మరొక నటి శోభితను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక సమంత కూడా దర్శకుడు రాజ్ తో రిలేషన్ కొనసాగిస్తూ చివరికి వీరిద్దరూ కూడా వివాహం చేసుకున్నారు.

తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు

Advertisement

ఇలా వీరి వివాహం గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో దర్శకుడు రాజ్ భార్య శ్యామలి దే తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఒక సంచలనమైన పోస్ట్ చేశారు.”తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు” అనే కొటేషన్ ను పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరి వివాహం నిజమేనని అందరూ భావించారు. అనుకున్న విధంగానే సమంత రెండవ వివాహం చేసుకోవడంతో ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలకు కారణం అయ్యింది. ఇక రాజ్ శ్యామలి కూడా 2022వ సంవత్సరంలోనే విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా ఈమె విడాకులు తీసుకొని విడిపోయినప్పటికీ సమంత రాజ్ గురించి నిత్యం సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా పోస్టులు చేస్తూ వార్తల్లో నిలిచారు.

Also Read: CPI Narayana: నేను పైరసీలో సినిమాలు చూస్తాను.. ఐ బొమ్మ రవి పై సీపీఐ నారాయణ కామెంట్స్!

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×