E-Paper
Advertisement

Vizag: వైజాగ్‌కు కొత్త కిరీటం: 300 రూపాయల టికెట్‌తో ఆకాశంలో నడిచే అనుభూతిని అందించనున్న స్కై వాక్ బ్రిడ్జ్

Vizag: వైజాగ్‌కు కొత్త కిరీటం: 300 రూపాయల టికెట్‌తో ఆకాశంలో నడిచే అనుభూతిని అందించనున్న స్కై వాక్ బ్రిడ్జ్
Advertisement

Vizag: ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నంలోని కైలాసగిరిపై ఐకానిక్ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ నేడు ప్రారంభం అయింది. ఈ బ్రిడ్జ్‌ను ఎంపీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ తేజ్ భరత్‌లు ప్రారంభించారు.

Advertisement

ఇది ఏడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ఇండియాలోనే అతిపెద్దది. ఈ బ్రిడ్జి 55 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో 1020 అడుగుల సముద్రపు ఎత్తులో నిర్మించారు. దీని కోసం జర్మన్ ఇంపోర్టెడ్ గాజు, బలమైన స్టీల్ స్ట్రక్చర్ ఉపయోగించారు. ఈ మెటీరియల్‌లు అధిక గాలి వేగాలు, వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా రూపొందించారు. ఇది నేటి నుంచే ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఈ బ్రిడ్జికి నిర్వహణ సంస్థ ఒక్కొక్కరికి 300 టికెట్ ధరగా నిర్ణయించింది.

ఈ బ్రిడ్జుపై MP భారత్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు విశాఖ టూరిజానికి మైలురాయిగా నిలుస్తుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోందని అన్నారు.

Advertisement

Also Read: ఓర్నాయనో.. బంగారం ధర రెండు లక్షలకు చేరువలో.. ఇక పసిడి ప్రియులకు రోల్డ్ గోల్డే దిక్కు.. 

ఈ పర్యాటక ప్రాంతం రాత్రి సమయంలో త్రివర్ణ లైటింగ్‌తో మెరుస్తూ ఉంటుంది, ఫోటోగ్రఫీకి అద్భుతమైన అవకాశాలు. కైలాసగిరికి రోప్‌వే, టాయ్ ట్రైన్, జిప్‌లైన్, స్కై సైక్లింగ్ వంటి ఇతర అట్రాక్షన్‌లు ఉన్నాయి. సంవత్సరానికి సగటున 3 లక్షల మంది సందర్శకులు కైలాస గిరిని సందర్శిస్తారు, ఈ బ్రిడ్జ్‌తో సందర్శకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×