Director Ravi Charan:ఇటీవల కాలంలో జెన్ జీ యువతను టార్గెట్గా చేసుకొని కొన్ని చిత్రాలు తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ యంగ్ హీరో కం డైరెక్టర్ విశ్వక్ సేన్ కల్ట్ అనే చిత్రంతో జెన్జీ యువతను టార్గట్ గా చేసుకొని సినిమా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరో డైరెక్టర్ ఏకంగా జెన్ జీ పేరు మీదే సినిమా చేస్తూ ఆడియన్స్ లో సరికొత్త క్యూరియాసిటీ పెంచేశారు. మరి ఆయన ఎవరు? అది ఏ చిత్రం? అనే విషయం ఎప్పుడు చూద్దాం.
ఆయన ఎవరో కాదు ప్రముఖ డైరెక్టర్ రవి చరణ్. ‘నల్లమల్ల’ లాంటి విభిన్నమైన చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న రవి చరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు, అలాంటి డైరెక్టర్ జోనర్ మార్చి కొత్త కథాంశంతో ‘GEN Z GIRLS’ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. ఎస్‌జేసీ క్రియేషన్స్ (శ్రీ జ్యోతిర్మయి క్రియేషన్స్) బ్యానర్‌పై మరో ఆసక్తికరమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్ 1గా రూపొందుతున్న ‘GEN Z GIRLS’ విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేసింది.
also read:విశ్వక్ సేన్ ఎదురుగా లైవ్‌లో వ్యక్తిని షూట్ చేసిన యాంకర్, అతడి పరిస్థితి ఎలా ఉందంటే?
పండుగ సందర్భంగా పోస్టర్‌ను విడుదల చేసి,షూటింగ్‌ను అతి త్వరలో స్టార్ట్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, కథాంశం, ఇతర సాంకేతిక వివరాలను చిత్ర యూనిట్ త్వరలో వెల్లడించనుంది.‘GEN Z GIRLS’ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.