Vishwaksen: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా కూడా నిలదొక్కుకున్న విశ్వక్ సేన్ (Vishwak sen) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణమైన నటుడిగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈయన.. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న విషయం తెలిసిందే. అలాంటి విశ్వక్ సేన్ తాజాగా స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం కల్ట్ (Cult). రచయితగా కూడా విశ్వక్ సేన్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. గాయత్రీ భరద్వాజ్, మురళీ శర్మ, తారక్ పొన్నప్ప, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 30వ తేదీన తెలుగు, హిందీ ,ఇంగ్లీష్, స్పానిష్, జపనీస్ భాషల్లో విడుదల కాబోతోంది.
ఇకపోతే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా R రేటెడ్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి ఇటీవల సెన్సార్ కూడా పూర్తయింది. పైగా ఏ సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా కేవలం యువత , జెన్ జీ ఆడియన్స్ను మాత్రమే టార్గెట్గా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాను అంటూ విశ్వక్ సేన్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక మరొకవైపు వరుస ప్రమోషన్స్ తో చిత్ర బృందం బిజీగా మారిపోయింది. ఇదిలా ఉండగా తాజాగా ప్రమోషన్ లో భాగంగా హీరో విశ్వక్ సేన్ ముందే.. ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ లైవ్ లో ఒక వ్యక్తిపై షూట్ చేశాడు.
ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. నాకు గన్స్ అంటే చాలా ఇష్టం అని తన అభిప్రాయాన్ని చెప్పాడు. సదరు యాంకర్ అవన్నీ రియల్ గన్సా అని అడగగా.. ఒకసారి చూడు నువ్వు అని నిజంగానే ఆ యాంకర్ కి గన్ ఇచ్చాడు విశ్వక్ సేన్. అతడు దానిని విశ్వక్ సేన్ ముందే షూట్ చేయగా ఎదురుగా ఉన్న వ్యక్తికి తగిలి ఆయన సడన్గా కింద పడిపోయారు. ఇక ఆ క్షణం ఏం జరిగిందో తెలియక సదరు యాంకర్ ఏం చేయాలో దిక్కుతోచక భయంతో వణికిపోయారు. ఇక వెంటనే ఆ వ్యక్తి పైకి లేచి నిలబడడంతో యాంకర్ ఊపిరి పీల్చుకున్నాడు. మొత్తానికైతే కల్ట్ మూవీ ప్రమోషన్స్ లో జరిగిన ఫ్రాంక్ షూట్ యాంకర్ ను మరింత భయానికి గురిచేసింది . మొత్తానికి అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
also read: రీఎంట్రీలో మరింత జోరు పెంచిన షాలిని.. ఆ నోటికి హద్దు అదుపు లేదా?
విశ్వక్ సేన్ కల్ట్ మూవీ విషయానికి వస్తే.. భారతదేశపు మొట్టమొదటి ఆర్ రేటెడ్ థ్రిల్లర్ మూవీగా ప్రచారం చేయబడుతోంది. గోవాలోని ఒక ఎస్టేట్ లో చిక్కుకుపోయిన 300 మందికి పైగా వ్యక్తుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. గేమ్ లో ఎలిమినేట్ అయిన వారిని నిర్ధాక్షణంగా చంపుతారు. ఈ గేమ్ కి మాస్టర్ గా విశ్వక్సేన్ వ్యవహరిస్తున్నారు. తీవ్రమైన హింస, ఉద్వేగ భరితమైన కథనం కారణంగా చిత్ర నిర్మాతలు ఈ చిత్రానికి ఆర్ రేటింగ్ ఇచ్చి కుటుంబాలు దూరంగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్నారు. మరి అక్టోబర్ 30న R రేటెడ్ గా ప్రచారం చేయబడుతున్న ఈ హింసాత్మక మూవీ యువతను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.