E-Paper
Advertisement

గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్ వెతుకుతున్నారా? మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ కావడం ఖాయం!

గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్ వెతుకుతున్నారా? మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ కావడం ఖాయం!
Advertisement

Fake customer care number scam: ప్రస్తుత టెక్ యుగంలో స్మార్ట్‌ ఫోన్ లేనిదే రోజు గడవదు. క్షణాల వ్యవధిలో ఆన్‌లైన్ పేమెంట్స్, మొబైల్ బ్యాంకింగ్ మన పనులను ఎంత ఈజీ చేశాయో.. సైబర్ నేరగాళ్ల దోపిడీ వల్ల అంత కంటే వేగంగా విస్తరిస్తోంది! మనం చేసే.. ఒక్క చిన్న పొరపాటు మన లైఫ్ టైమ్ సేవింగ్స్‌ను సెకన్లలో గాల్లోకి కలిపేస్తుంది. చిన్న సమస్య వచ్చినా, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఆగిపోయినా, అర్జెంట్‌గా కస్టమర్ కేర్ హెల్ప్ కావాలన్నా మనం చేసే.. ఫస్ట్ థింగ్ గూగుల్‌లో వెతకడమే. బట్ బీ అలర్ట్.. ఇదే అలవాటు మిమ్మల్ని రోడ్డున పడేస్తుందని మీకు తెలుసా?

సైబర్ కేటుగాళ్ల పక్కా ప్లాన్:

బ్యాంకులు, పాపులర్ ఈ-కామర్స్ సైట్లు, డిజిటల్ వ్యాలెట్ల ఒరిజినల్ కస్టమర్ కేర్ నంబర్ల ప్లేస్‌లో.. సైబర్ కేటుగాళ్లు గూగుల్‌లో ఫేక్ నంబర్లను అప్‌డేట్ చేస్తున్నారు. ట్రెండింగ్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ట్రిక్స్ వాడుతూ.. నకిలీ వెబ్‌సైట్లు, బ్లాగులు క్రియేట్ చేసి ఈ మోసపూరిత నంబర్లను గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో కనిపించేలా సెట్ చేస్తున్నారు. సామాన్యులు ఇది అసలు నంబరే అనుకుని కాల్ చేస్తే చాలు.. అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది!

ఒక్క ఫోన్ కాల్.. నిలువునా దోపిడీ!

Advertisement

మీరు ఆ నకిలీ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేయగానే.. అవతలి వైపు నుంచి అచ్చం బ్యాంక్ అఫీషియల్ లాగే మాట్లాడతారు. మీ ప్రాబ్లమ్‌ను ఇప్పుడే సాల్వ్ చేస్తామని బిల్డప్ ఇస్తారు. నమ్మకం కుదిరాక.. ఫోన్‌కు వచ్చే ఓటీపీ చెప్పమంటారు, లేదా AnyDesk, TeamViewer లాంటి రిమోట్ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోమని ఆర్డర్ వేస్తారు. వన్స్ మీరు ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసి పర్మిషన్స్ ఇస్తే.. మీ ఫోన్ కంప్లీట్ వారి కంట్రోల్‌లోకి వెళ్తుంది. అంతే! మీ బ్యాంక్ అకౌంట్ కనురెప్పపాటులో ఖాళీ అయిపోతుంది.

Also Read: బడ్జెట్ ధరకు అద్భుతమైన ఫీచర్లు..రూ.7,590కే బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్!

సేఫ్‌గా ఉండాలంటే ట్రిక్స్ :

Advertisement

అధికారిక యాప్స్ బెస్ట్: ఎప్పుడైనా సరే ..బ్యాంక్ హెల్ప్‌లైన్ నంబర్ల కోసం గూగుల్‌ను నమ్ముకోకండి. కేవలం ఆయా బ్యాంకుల అఫీషియల్ మొబైల్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్ లో ఉన్న నంబర్లను మాత్రమే యూజ్ చేయండి.

కార్డు వెనక ఉండే నంబర్సే సేఫ్: మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ బ్యాక్ సైడ్ ఉండే టోల్ ఫ్రీ కస్టమర్ కేర్ నంబర్ మోస్ట్ సెక్యూర్డ్.ఎమర్జెన్సీ టైమ్‌లో దానినే కాంటాక్ట్ చేయండి.

పర్సనల్ డీటెయిల్స్ నో షేరింగ్: ఏ బ్యాంక్ మేనేజర్ లేదా ఎంప్లాయ్ కూడా ఫోన్ చేసి పిన్ నంబర్, పాస్‌ వర్డ్ లేదా ఓటీపీ అడగరు.పొరపాటున కూడా ఎవరికీ చెప్పకండి.

ఎనీడెస్క్ యాప్‌లకు నో చెప్పండి: అన్-నోన్ పర్సన్స్ చెప్పే మాటలు విని ఎలాంటి రిమోట్ యాప్స్‌ను మీ ఫోన్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఇన్స్టాల్ చేయకండి.

ఫైనాన్షియల్ లాస్ అండ్ ప్రొటెక్షన్ కాస్ట్:

ఒకసారి సైబర్ ఫ్రాడ్స్‌ బారిన పడి మనీ లాస్ అయితే వాటిని రికవర్ చేయడం చాలా టఫ్ టాస్క్. మోసపోయామని తెలిసిన వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేసి కంప్లైంట్ చేయాలి. అలాగే cybercrime.gov.in పోర్టల్‌లో రిపోర్ట్ చేయాలి. డిజిటల్ ప్రొటెక్షన్ కోసం మార్కెట్లో దొరికే బెస్ట్ యాంటీ-ఫ్రాడ్ యాప్స్ లేదా సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్లను యూజ్ చేయడం ద్వారా సేఫ్‌గా ఉండొచ్చు.

 

Related News

ఇక మీ చాట్‌జీపీటీ డేటా సేఫ్..ఫేస్ ఐడీ, పిన్ లాక్ ఫీచర్ వచ్చేసింది!

జియో సరికొత్త ప్లాన్.. రూ.450కే ఫ్రీ కాల్స్, అపరిమిత 5G.. ఇంకా ఎగిరిగంతేసే బెనిఫిట్స్!

సేల్‌లో..బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్స్,వెంటనే కొనేయండి

డార్క్ వెబ్‌లో SBI కస్టమర్ల వ్యక్తిగత డేటా లీక్.. అకౌంట్లు సురక్షితమేనా?

బడ్జెట్ ధరకు అద్భుతమైన ఫీచర్లు..రూ.7,590కే బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్!

రూ.13,699కే ఫుల్ హెచ్‌డీ టీవీ!మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్

బడ్జెట్ గేమింగ్ హెడ్‌ఫోన్..మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో లాంచ్

Big Stories

Advertisement
×