E-Paper
Advertisement

Saailu Kampati: ఒక రూపాయి కోసం రూమ్ మొత్తం వెతికా, మీ కష్టం పగోడు కూడా రాకూడదు అన్న

Saailu Kampati: ఒక రూపాయి కోసం రూమ్ మొత్తం వెతికా, మీ కష్టం పగోడు కూడా రాకూడదు అన్న
Advertisement

Saailu Kampati: ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తు పల్లాలు ఉండటం అనేది సహజంగా జరుగుతుంది. అయితే ముఖ్యంగా సినిమా వాళ్ళ జీవితాల్లో ఉండే కథలు అన్ని ఇన్ని కావు. ఆ కష్టాలు కన్నీళ్లు అన్నీ కూడా ఆ వ్యక్తి సక్సెస్ అయిన తర్వాతే బయటకు చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. మామూలుగా ఏ సినిమా వాడు కూడా అవతల వాడికి తన కష్టాన్ని చెప్పుకోడు, ఎందుకంటే అదే కష్టాన్ని వాడు ఆల్రెడీ అనుభవిస్తున్నాడు అని వీడికి తెలుసు కాబట్టి.

బయట ఎన్ని అవకాశాలు ఉన్నా కూడా కేవలం సినిమా ఫీల్డ్ లోనే ఏదో సాధించాలి అనే ఉద్దేశంతో సంవత్సరాలు తరబడి ఎదురు చూస్తున్న వాళ్ళు ఇప్పటికే ఉన్నారు. కొంతమంది సక్సెస్ అవుతారు ఇంకొంతమంది ఫెయిలవుతారు. కానీ ఎప్పటికైనా సక్సెస్ అవుతాము అని ఉద్దేశంతో కొంతమంది బతుకుతుంటారు. ఇక రీసెంట్ గా రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు దర్శకుడు సాయిలు కంపాటి.

రూపాయి కోసం రూమ్ మొత్తం వెతికా 

Advertisement

సాయిలు కంపాటి తన జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటనను షేర్ చేసుకున్నారు. ఆర్ఎక్స్ 100 సినిమా విడుదలైనప్పుడు వర్షాన్ని కూడా పట్టించుకోకుండా విపరీతంగా ఆడియన్స్ అందరూ కూడా ఆ సినిమా కోసం పరిగెట్టారట. అది చూసి కచ్చితంగా ఎలా అయినా ఈ సినిమా చూడాలి అని సాయిలు కంపాటి నిర్ణయించుకున్నాడు.

అయితే సినిమా టికెట్ అప్పుడు కేవలం 20 రూపాయలు మాత్రమే. అప్పుడు తన రూమ్ లో ఎక్కడైనా డబ్బులు ఉంటాయేమో అని చుట్టూ వెతకడం మొదలుపెట్టాడు. ఒక రకంగా దీనిని దొంగతనమనే చెప్పాలి మా ఫ్రెండ్ జేబులో కూడా ఏమైనా మర్చిపోయాడేమో అని వెతకడం మొదలుపెట్టాను అంటూ చెప్పాడు.

Advertisement

రూమ్ అంతా వెతికిన తర్వాత కేవలం 19 రూపాయలు మాత్రమే దొరికాయట. ఆ ఒక్క రూపాయి కోసం రూమ్ అంతా గాలించినా కూడా దొరకలేదట. ఈ రూపాయి ఎవరిని అడుగుతాం అని ఒక ఆలోచనలో ఉండిపోయాడు. అయితే నడుచుకుంటూ థియేటర్ వరకు వెళ్లి అక్కడ 15 రూపాయలు పెట్టి బజ్జీలు తిని రూమ్ కి వచ్చేసాడట. తరువాత వాళ్ళకి తెలిసిన ఒక ఫ్రెండ్ ని 50 రూపాయలు అడిగి ఆ సినిమాకు వెళ్లారట.

Also Read: Raju Weds Ramabai : అమీర్పేట్ వ్యాఖ్యలపై మాట మార్చిన డైరెక్టర్… సారీ చెబుతూ..

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×