E-Paper
Advertisement

Sleep Hours: రోజూ 5 గంటలే నిద్రపోతున్నారా? అయితే, మీరు సూపర్ హీరోలే, ఎందుకంటే?

Sleep Hours: రోజూ 5 గంటలే నిద్రపోతున్నారా? అయితే, మీరు సూపర్ హీరోలే, ఎందుకంటే?
Advertisement

నిద్ర విషయంలో చాలా మంది రకరకాల వాదనలు వినిపిస్తారు. కొంత మంది 8 గంటలు నిద్రపోవాలంటే, మరికొంత మంది తక్కువ నిద్రపోయినా ఫర్వాలేదంటారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోతారట. ఈ విషయాన్ని ఆయన చాలాసార్లు చెప్పారు. ఆయనే కాదు, చాలా మంది 5 గంటలకు మించి నిద్రపోరట. అయినా, సరే వీళ్లు యాక్టివ్ గా ఎలా ఉండగలుగుతున్నారనే సందేహంతో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఓ అరుదైన జీన్ వల్లే వాళ్లకు ఈ వరం దక్కినట్లు చెప్పారు.

కొంత మందిలో సూపర్ స్లీప్ సామర్థ్యం!

చాలా వరకు నిపుణులు చెప్పే మాట.. మనిషి యాక్టివ్ గా ఉండాలంటే రోజుకు కనీసం రాత్రి 7-9 గంటల నిద్ర అవసరం. కానీ, కొంత మంది కేవలం 4 నుంచి 6 గంటలు నిద్రపోయినా చాఆ ఎనర్జిటిక్ గా ఉంటారని చెప్తున్నారు. చాలా తక్కువ నిద్రపోయినప్పుడు మిగతా వారిలాగా వారు అలసిపోయినట్లు, చిరాకుగా, అనారోగ్యంగా అనిపించరు. శాస్త్రవేత్తలు వారిని ‘నేచురల్ షార్ట్ స్లీపర్స్’ గా పిలుస్తారు. తక్కువ నిద్రపోయినా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండే కుటుంబాల శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో కీలక విషయాలను గుర్తించారు.

ఇంతకీ పరిశోధకులు ఏం గుర్తించారంటే?   

Advertisement

తక్కువ నిద్రపోయినా యాక్టివ్ ఉండే వారిలో అత్యంత ప్రత్యేకమైన DEC2 జన్యువు ఉన్నట్లు గుర్తించారు. 2009లో, కాలిఫోర్నియాలోని శాస్త్రవేత్తల బృందం DEC2 అనే జన్యువులో ఒక మ్యుటేషన్ ను కనుగొంది. ఈ జన్యువు ఉన్న వారిలో సుమారు 6 గంటలు మాత్రమే నిద్రపోతారు. కొన్నిసార్లు 4-5 గంటలు నిద్రపోయినా చాలా యాక్టివ్ గా ఉంటారు. చక్కటి జ్ఞాపకశక్తి, మంచి మానసిక స్థితిని కలిగి ఉంటారు. ఎక్కువ అనారోగ్యానికి గురికారు. నిద్రలో మెదడు చాలా వేగంగా రీష్రెష్ కావడానికి ఈ జన్యువు సాయపడుతుంది. తక్కువ నిద్ర కూడా వారికి సరిపోతుంది.

అత్యంత అరుదుగా DEC2 జన్యువు

1,000 మందిలో 1 కంటే తక్కువ మందికి ఈ DEC2 మ్యుటేషన్ ఉంటుంది. కొంతమంది నిపుణులు 10,000 మందిలో 1 మాత్రమే ఉండవచ్చని భావిస్తున్నారు.

సాధారణ వ్యక్తులు 5 గంటలు నిద్రపోతే?  

Advertisement

ఈ జన్యువు ఉన్నవారు మాత్రమే 5 గంటలు నిద్రపోతే సరిపోతుంది. ఇతరులు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదంటున్నారు. ప్రత్యేక జన్యువులు లేకపోతే, 5 గంటలు మాత్రమే నిద్రపోవడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు.

⦿ మానసిక స్థితి దెబ్బతింటుంది.

⦿ రోగనిరోధక వ్యవస్థ బలహీనం అవుతుంది.

⦿ గుండె, శరీర ఆరోగ్యం క్షీణిస్తుంది.

Read Also: 2026లో భూమి అంతం? దీనిపై AI ఏం చెప్పిందో తెలుసా? ఇది చదివితే ఆశ్చర్యపోతారు!

భవిష్యత్తులో పరిశోధకులు ఏం చేయబోతున్నారు?

DEC2 జన్యువులా పనిచేసే సురక్షితమైన ఔషధాన్ని తయారు చేయాలని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. ఒక రోజు ప్రతి ఒక్కరూ తక్కువ నిద్రపోయేలా చేసి ఇంకా పరిపూర్ణంగా ఉండేలా చేసే మాత్ర ఉండవచ్చని ఆలోచిస్తున్నారు. లియోనార్డో డా విన్సీ, నెపోలియన్, మార్గరెట్ థాచర్ తో పాటు ప్రస్తుత టాప్ టెక్ కంపెనీల CEOలు కూడా తక్కువగా నిద్రపోతున్నారట.

Read Also: ఈ దేశంలో యుద్ధం వచ్చినా, విపత్తు వచ్చినా.. ఒక్క పౌరుడు కూడా చావడు, గ్రేట్ సెల్యూట్!

Related News

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

Big Stories

Advertisement
×