E-Paper
Advertisement

Raju Weds Ramabai : అమీర్పేట్ వ్యాఖ్యలపై మాట మార్చిన డైరెక్టర్… సారీ చెబుతూ..

Raju Weds Ramabai : అమీర్పేట్ వ్యాఖ్యలపై మాట మార్చిన డైరెక్టర్… సారీ చెబుతూ..
Advertisement

Raju Weds Ramabai : తెలుగు ప్రేక్షకులు మంచి కథలను ఎప్పటికీ ఆదరిస్తారు అనేది కొన్ని సినిమాలు ప్రూవ్ చేస్తూ ఉంటాయి. ఈరోజు బాక్స్ ఆఫీస్ వద్ద చాలా సినిమాలు విడుదలయ్యాయి. ఎప్పటినుంచో కొంత గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు రాజ్ తరుణ్. అతను నటించిన పాంచ్ మీనార్ సినిమా నేడు విడుదలైంది. పెళ్లిచూపులు సినిమాతోనే విపరీతమైన గుర్తింపు సాధించుకున్న ప్రియదర్శి నటించిన సినిమా ప్రేమంటే కూడా నేడు విడుదలైంది.

ప్రియదర్శి మరియు రాజ్ తరుణ్ కు గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. కానీ ఎటువంటి ప్రత్యేకమైన గుర్తింపు లేకుండా రిలీజ్ అయిన కొత్త సినిమాకు నేడు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సాయిలు కంపాటి దర్శకుడుగా పరిచయమైన రాజు వెడ్స్ రాంబాయి సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా బుకింగ్స్ చాలా బాగున్నాయి. నిన్న ప్రీమియర్ షోస్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

అమీర్పేట్ వ్యాఖ్యలపై మాట మార్చేశారు 

Advertisement

కొన్ని సందర్భాలలో దర్శకులు వాళ్ళ సినిమాలను ప్రమోట్ చేయడానికి కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. అయితే ఆ స్టేట్మెంట్స్ ఆ టైం కి బానే ఉంటాయి కానీ తర్వాత చూసుకుంటుంటే వాళ్ల మీద వాళ్లకే ఏదో ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. అదే ఫీలింగ్ రాజు వెడ్స్ రాంబాయి సినిమా సాయిలు కంపాటి కూడా జరిగినట్టుంది.

సాయిలు మాట్లాడుతూ ఈ సినిమాకి నెగిటివ్ టాక్ తీసుకురావద్దన్నా ఒకవేళ ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే అమీర్పేట్ సెంటర్లో నేను బట్టలిప్పి , కట్ డ్రాయర్ పైన నిలుచుంటా అని చెప్పాడు. అది విన్న తర్వాత చాలామందికి ఆశ్చర్యం కలిగింది. కొంతమంది ట్రోలింగ్ కూడా చేశారు.

Advertisement

అయితే ఆ మాటలు పైన సాయిలు మరోసారి స్పందించాడు. నేను అనవసరంగా అలా మాట్లాడాను నన్ను క్షమించండి అన్నా. కావాలని చెప్పలేదు ఏదో హడావిడిలో అలా చెప్పేసాను. అంటూ క్షమాపణలు చెప్పాడు.

ఈసారి ఆ పని చేస్తా 

ఈ సినిమాకి సంబంధించిన అప్రిసేషన్ మీట్ పెట్టారు. ఈ మీట్ లో దర్శకుడు సాయిలు మాట్లాడుతూ నేను మొన్న ఆ కామెంట్స్ చేసినందుకు క్షమించండి అన్న. ఇప్పుడు అమీర్పేటలో నేను బ్యాండ్ కొడతా. థియేటర్లో మన సినిమా బ్యాండ్ మోగుతుంది బయట మన బ్యాండ్ మోగుతుంది అంటూ చెప్పాడు దర్శకుడు సాయిలు కంపాటి.

Also Read: Champion movie: రోషన్ మేక సరసన మలయాళీ బ్యూటీ, ఫస్ట్ లుక్ అదిరింది

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×