E-Paper
Advertisement

ప్యారడైజ్ ఎఫెక్ట్ నాని ‘బ్లడీ రోమియో’ ఆలస్యం.. పవన్ సినిమా పై ఫోకస్ చేసిన సుజీత్

ప్యారడైజ్ ఎఫెక్ట్ నాని ‘బ్లడీ రోమియో’ ఆలస్యం.. పవన్ సినిమా పై ఫోకస్ చేసిన సుజీత్
Advertisement

Director Sujeeth: డైరెక్టర్ సుజిత్ టాలీవుడ్ దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇటీవల పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా తెరకెక్కిన ఒజి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు .ఈ సినిమా అనంతరం సుజిత్ నాచురల్ స్టార్ నాని(Nani)తో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఘనంగా గత ఏడాది దసరా పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి కావడంతో రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభమవుతాయని అందరూ భావించారు కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం ఆలస్యం అవుతుంది.

ఆలస్యం కానున్న బ్లడీ రోమియో..

ఇటీవల నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు బ్లడీ రోమియో(Bloody Romeo) అనే టైటిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభించబోతున్నట్లు గతంలో చిత్ర బృందం తెలియజేశారు కానీ ఈ సినిమా ఈ ఏడాది సెట్స్ పైకి వెళ్లే మార్గాలు కనిపించడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ది ప్యారడైజ్ అనే సినిమా పనులలో బిజీగా ఉన్నారు నిజానికి ఈ సినిమాని మార్చి 26వ తేదీ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు ఇలా ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల అయ్యి ఉంటే ఏప్రిల్ లేదా మే నుంచి నాని సుజిత్ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం అయ్యేది.

ఆగస్టు 21న రాబోతున్న ది ప్యారడైజ్..

Advertisement

మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ది ప్యారడైజ్ సినిమా కాస్త ఆగస్టు 21వ తేదీ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఆగస్టు 21న కూడా ఈ సినిమా రాదని ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా ఈ సినిమా ఆలస్యం కావడంతో సుజిత్ సైతం తన బ్లడీ రోమియో సినిమాని వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావడానికి మరింత సమయం పడుతున్న నేపథ్యంలో సుజిత్ పవన్ కళ్యాణ్ ఒజి 2(OG 2) స్క్రిప్ట్ పనులపై దృష్టి సారించారని ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులను పూర్తిచేసే ఆలోచనలో సుజిత్ ఉన్నారు.

2027 లోనే ఒజి 2 ప్రారంభం..

Advertisement

ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎలాంటి కొత్త సినిమాలకు కమిట్ అవ్వలేదు కానీ ఈయన గతంలో కమిట్ అయిన ఓజి సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ సినిమాని చేస్తానని తెలియజేశారు. ఇక సుజిత్ నాని సినిమా పూర్తి అయిన తరువాతనే ఒజి 2 పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ఇక నాని బ్లడీ రోమియో ఈ ఏడాది చివరిలో రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించినా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా అనంతరమే పవన్ కళ్యాణ్ ఓజి 2 సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

Also Read: అవినీతి చేసి ఉంటే చెప్పుతో కొట్టండి… సవాల్ విసిరిన పోసాని!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×