E-Paper
Advertisement

అలెర్ట్.. మీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 5.0 వెర్షనా? అయితే ఇక వాట్సప్ శాశ్వతంగా క్లోజ్, వెంటనే ఇది చెక్ చేయండి!

అలెర్ట్.. మీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 5.0 వెర్షనా? అయితే ఇక వాట్సప్ శాశ్వతంగా క్లోజ్, వెంటనే ఇది చెక్ చేయండి!
Advertisement

WhatsApp Stop Working: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. రేపటి (మే 8వ తేదీ) నుంచి కొన్ని పాత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ 5.0 లేదా అంతకంటే తక్కువ వెర్షన్ సాఫ్ట్‌వేర్‌తో పనిచేసే ఫోన్లకు ఈ ముప్పు పొంచి ఉంది. టెక్నాలజీ మారుతున్న కొద్దీ పాత పరికరాల్లో భద్రతను కొనసాగించడం కష్టమవుతున్న నేపథ్యంలో కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

మారిన వాట్సప్ నిబంధనలు:

చాలా ఏళ్ల క్రితం విడుదలైన స్మార్ట్‌ఫోన్లను వాడుతున్న లక్షలాది మందిపై ఈ ప్రభావం పడనుంది. దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన ఫోన్లను ఉపయోగిస్తున్న వారు రేపటి నుంచి తమ ప్రియమైన వారికి మెసేజ్‌లు పంపలేరు. ఇప్పటికే చాలామందికి వాట్సాప్ నుంచి నోటిఫికేషన్లు అందాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోమని లేదా కొత్త ఫోన్‌కు మారమని కంపెనీ హెచ్చరిస్తోంది. తాజా ఫీచర్లు, మెరుగైన సెక్యూరిటీ కోసం ఈ అప్‌డేట్ తప్పనిసరని వాట్సప్ స్పష్టం చేసింది.

ఆ ఫోన్ల జాబితా ఇదే:

Advertisement

ఈ మార్పు వల్ల శాంసంగ్ గెలాక్సీ S3, S4 వంటి పాపులర్ మోడల్స్‌తో పాటు మోటొరోలా మోటో G మొదటి, రెండో తరం ఫోన్లలో వాట్సప్ ఆగిపోనుంది. సోనీ ఎక్స్‌పీరియా Z సిరీస్, ఎల్‌జీ నెక్సస్ 4, హెచ్‌టీసీ వన్ X వంటి పాత మోడల్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అంతేకాకుండా.. ఒప్పో ఫైండ్ 7, వివో Y15, Y22 వంటి పాత వెర్షన్ ఫోన్లలో కూడా రేపటి నుంచి వాట్సప్ సేవలు అందుబాటులో ఉండవు. మీ దగ్గర ఇలాంటి పాత ఫోన్ ఉంటే వెంటనే అప్రమత్తం కావడం అవసరం.

Also Read: రూ.20 వేలకే వన్‌ప్లస్ కొత్త ఫోన్.. Nord CE 6 సిరీస్ అదిరిపోయే ఎంట్రీ, సేల్ ఎప్పటి నుంచంటే?

భద్రత కోసమే ఈ నిర్ణయం:

Advertisement

కేవలం టెక్నాలజీ కోసమే కాకుండా.. యూజర్ల వ్యక్తిగత సమాచారం తస్కరణకు గురికాకూడదనే ఉద్దేశంతోనే పాత ఓఎస్ వెర్షన్లను వాట్సప్ వదులుకుంటోంది. పాత ఆండ్రాయిడ్ సిస్టమ్స్‌లో హ్యాకింగ్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. ఇప్పుడుంతా మనం వాట్సప్‌ను కేవలం చాటింగ్ కోసం కాకుండా బ్యాంకింగ్ సమాచారం, ఓటీపీలు, ఆఫీస్ ఫైల్స్ పంపడానికి వాడుతున్నాం. ఇంతటి కీలక సమాచారం భద్రంగా ఉండాలంటే పాత సాఫ్ట్‌వేర్ ఫోన్లలో వాట్సప్ సేవలను ఆపివేయడమే ఉత్తమమని కంపెనీ భావిస్తోంది.

ఫోన్ వెర్షన్‌ చెక్ చేయడమెలా?

మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి About Phone లేదా Software Information ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీ ఫోన్ ఏ ఆండ్రాయిడ్ వెర్షన్‌తో పనిచేస్తుందో కనిపిస్తుంది. ఒకవేళ అది ఆండ్రాయిడ్ 5.0 లేదా అంతకంటే తక్కువగా ఉంటే.. రేపటి నుండి మీ ఫోన్‌లో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయి. కాబట్టి.. వెంటనే చెక్ చేసుకుని అప్రమత్తమవ్వండి.

బ్యాకప్ తీసుకున్నారా?

ఒకవేళ మీ ఫోన్ పాత వెర్షన్ అని తెలిస్తే.. వెంటనే మీ వాట్సప్ డేటాను బ్యాకప్ చేసుకోవడం మంచిది. ముఖ్యమైన చాట్స్, ఫొటోలు, వీడియోలను గూగుల్ డ్రైవ్‌లో సేవ్ చేసుకోండి. వాట్సప్ సేవలు నిరంతరాయంగా అందాలంటే కొత్త వెర్షన్ ఆండ్రాయిడ్ ఫోన్‌కు మారడం ఒక్కటే మార్గం. డేటా భద్రత దృష్ట్యా కూడా కొత్త ఫోన్ కొనడమే శ్రేయస్కరమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: మడతపెట్టే ఫోన్లలో మోటరోలా సరికొత్త ప్రయోగం.. Razr Fold భారత్‌లోకి వచ్చేస్తోంది, మీరు రెడీయా?

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×