E-Paper
Advertisement

ఈ కేసుతో నాకు సంబంధం లేదు… మంగ్లీ వివాదంపై డైరెక్టర్ క్లారిటీ!

ఈ కేసుతో నాకు సంబంధం లేదు… మంగ్లీ వివాదంపై డైరెక్టర్ క్లారిటీ!
Advertisement

Venu Udugula: డైరెక్టర్ వేణు ఊడుగుల పేరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినపడుతుంది సింగర్ మంగ్లీ(Mangli) వివాదం కారణంగా డైరెక్టర్ వేణు పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు అయింది అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అడ్వకేట్ సుబ్బారావు (Subbarao)సింగర్ మంగ్లీ పై ఆరోపణలు చేస్తూ.. మంగ్లీ తన వద్ద 10 కోట్ల రూపాయలు తీసుకొని తనని మోసం చేసిందని అడిగితే శవం కూడా కనిపించకుండా చేస్తాను అంటూ బెదిరించిందని అడ్వకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ విధంగా మంగ్లీ సుమారు 15 మందిని మోసం చేశారని లాయర్ ఆరోపణలు చేశారు.

ఈ కేసుతో నాకు సంబంధం లేదు..

ఇక ఈ కుట్రలో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు డైరెక్టర్ వేణు సైతం బాగమయ్యారు అంటూ ఆరోపణలు చేయడమే కాకుండా వీరిపై కేసు నమోదు చేశారు. BNS 351(2),352 సెక్షన్ల ప్రకారం మంగ్లీ తో పాటు, డైరెక్టర్ వేణు మంగ్లీ సోదరడు పై కేసు నమోదు చేశారనీ వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలపై డైరెక్టర్ వేణు ఊడుగుల (Venu Udugula)స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈయన సోషల్ మీడియా వేదికగా ఈ వివాదం గురించి స్పందిస్తూ తనకు ఏమాత్రం సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.

బాధితులకు న్యాయం జరగాలి..

Advertisement

ఈ సందర్భంగా వేణు స్పందిస్తూ ఇటీవల కొన్ని మీడియా వేదికలలో నా పేరు సింగర్ మంగ్లీ కేసుతో అనుసంధానం చేస్తూ వచ్చిన వార్తలు చూసి నాకు చాలా బాధనిపించింది. నాకు ఆ ఘటనతో ఎలాంటి సంబంధం లేదు. మంగ్లీ అలాగే ఫిర్యాదు చేసిన అడ్వకేట్ సుబ్బారావు ఇద్దరు నాకు పరిచయం ఉన్న వ్యక్తులు కావడంతో సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని బాధితులకు న్యాయం జరగాలని మాత్రమే నేను సూచించాను దానికంటే మించి ఇందులో నేను ఎలాంటి పాత్ర పోషించలేదని తెలిపారు. ఈ సందర్భంగా తాను మరో విషయం పట్ల స్పష్టం చేయాలని భావిస్తున్నాను .ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ లో కూడా నా పేరు నిందితుడిగా ఎక్కడ ప్రస్తావించబడలేదు. అలాగే కేసు పెట్టిన అడ్వకేట్ సుబ్బారావు గారు కూడా ఈరోజు మీడియా ముందు మాట్లాడుతూ నాకు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా తెలియజేశారు.

నిజా నిజాలు తెలుసుకోండి..

Advertisement

ఇక ఈ విషయానికి సంబంధించి వీడియో కూడా ప్రస్తుతం అందుబాటులో ఉందని నిజా నిజాలు తెలుసుకోకుండా నా పేరును ఈ వ్యవహారంతో కలిపి ప్రచారం చేయడం చాలా బాధాకరం. ఇక పంజాగుట్ట పోలీస్ వారు కూడా తమ విచారణలో నాకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించారు. ఒక వ్యక్తి పరువు ప్రతిష్ట కుటుంబం ఇవన్నీ కూడా ఇలాంటి వార్తల వల్ల ప్రభావితం అవుతాయి. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ గమనించాల్సిందని ఈయన విజ్ఞప్తి చేశారు. నాపై మీరు చూపిన ప్రేమ ఆదరణ ఎల్లప్పుడూ నాకు బలం ఇస్తాయని ,అదే విశ్వాసంతో ఈ విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ వేణు ఈ వివాదం పై స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చారు.

Also Read: ఎన్టీఆర్ నీల్ సినిమా నుంచి  టోవినో థామస్ ఔట్… రంగంలోకి బాలీవుడ్ స్టార్ హీరో?

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×