E-Paper
Advertisement

ఎన్టీఆర్ నీల్ సినిమా నుంచి  టోవినో థామస్ ఔట్… రంగంలోకి బాలీవుడ్ స్టార్ హీరో?

ఎన్టీఆర్ నీల్ సినిమా నుంచి  టోవినో థామస్ ఔట్… రంగంలోకి బాలీవుడ్ స్టార్ హీరో?
Advertisement

Jr.NTR -Neel: టాలీవుడ్ స్టార్ హీరో గాడ్ ఆఫ్ మాసెస్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. సుమారు 40% వరకు షూటింగ్ పనులు జరుపుకుంటుందని తెలుస్తోంది. ఈ సినిమా గత ఏడాది షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ ఇప్పటివరకు కేవలం 40% షూటింగ్ మాత్రమే జరిగింది అంటే అభిమానులు కూడా కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ప్రకటించబోతున్నట్టు సమాచారం.

ఎన్టీఆర్ నీల్ సినిమా నుంచి తప్పుకున్న టోవినో థామస్..

మే 20 వ తేదీ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ తో పాటు, ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది . ఇదిలా ఉండగా ఈ సినిమాలో పలువురు నటీనటులు బాగమవుతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కుష్బూ అనిల్ కపూర్ వంటి వారు నటించబోతున్నారని తెలుస్తుంది .కానీ ఇప్పటివరకు అధికారక ప్రకటన మాత్రం వెల్లడించలేదు. ఇక ఈ సినిమాలో యంగ్ హీరో టోవినో థామస్ (Tovino Thomas) నటించబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించారు. అయితే ఇటీవల ఒక సినిమా వేడుకలో భాగంగా టోవినో థామస్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలిపారు.

టోవినో థామస్ బదులుగా షాహిద్ కపూర్..

Advertisement

తన వ్యక్తిగత కారణాలు అలాగే డేట్స్ అడ్జస్ట్ కానీ నేపథ్యంలో తాను ఈ సినిమా నుంచి తప్పుకున్నానని ఈయన క్లారిటీ ఇచ్చారు. ఇలా టోవినో థామస్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో మరెవరు నటించబోతున్నారనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.ఈ నేపథ్యంలోనే పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో షాహిద్ కపూర్ (ShahidKapoor) ఒకరు. ప్రస్తుతం చిత్ర బృందం షాహిద్ కపూర్ తో చర్చలు జరుపుతున్నారని టోవినో థామస్ స్థానంలో షాహిద్ కపూర్ ను తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. షాహిద్ కపూర్ కథ విన్న తర్వాత కాస్త సానుకూలంగానే స్పందించారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ జోడిగా రుక్మిణి వసంత్…

Advertisement

ఇక ఈ సినిమాలో టోవినో థామస్ స్థానంలో షాహిద్ కపూర్ నటించబోతున్నారా? లేదా అనేది తెలియాలి అంటే చిత్ర బృందం నుంచి అధికారక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇక ఈ సినిమా భారీ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ జోడిగా నటి రుక్మిణి వసంత్(Rukmini Vasanth) నటించబోతున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలకపాత్రలో నటిస్తున్నారని నటి కుష్బూ కూడా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. వీటన్నిటి పట్ల స్పష్టత రావాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.

Also Read: మరోసారి చీర వివాదంపై ఘాటుగా స్పందించిన అనసూయ.. శివాజీ సృష్టించిన చీర అంటూ!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×