E-Paper
Advertisement

మరీ ఇంత దారుణమా.. నిరుద్యోగం గురించి ప్రశ్నిస్తే నోటీసులిస్తారా..?.

మరీ ఇంత దారుణమా.. నిరుద్యోగం గురించి ప్రశ్నిస్తే నోటీసులిస్తారా..?.
Advertisement

NIA Notice: స్వేచ్ఛ బ్యూరో: సీపీఐ (ఎం.ఎల్ ఎ) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావును తనకు సంబంధం లేని కేసులో విచారణకు రావాలని కోరుతూ ఎన్.ఐ.ఏ నోటీసు ఇవ్వడాన్ని వామపక్ష పార్టీలుగా తీవ్రంగా ఖండించాయి. ఈ ఎన్.ఐ.ఏ. నోటీసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. శనివారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈనెల 22 మాదాపూర్ కార్యాలయానికి హాజరుకావాలని ఎన్ఐఏ నోటీసుఇచ్చిందన్నారు. ఈ కేసు నంబరును పరిశీలించగా గాదె ఇన్నయ్యకు సంబంధించిన కేసు అని స్పష్టమైందన్నారు.

రాజ్యాంగబద్ధంగా..

గాదే ఇన్నయ్యను అరెస్టు చేస్తున్న విషయంలో పోలీసులు, రాజ్యం, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలనీ, ఎవరికైనా ముందస్తు నోటీసులూ, ముందస్తు సమాచారం ఇవ్వాలనీ, ఎలాంటి సమాచారం లేకుండా ఇష్టానుసారంగా పోలీసులు అరెస్టు చేయడం సరియైనది కాదనీ, చట్టబద్ధంగా వ్యవహరించాలనీ కోరారు. సంఘటనను ఖండించారు. అంతకుమించి ఆ విషయంతో పోటు రంగారావుకు ఏలాంటి సంబంధం లేదని, కాని ఈ విషయంలో ఆయనను విచారించడం అవసరం లేదని భావిస్తున్నామన్నారు.

Advertisement

Also Read: అపరిచితులకు మీ ఫోన్ నెంబర్ కనిపించకూడదా? అయితే వాట్సప్‌లో ఈ సెట్టింగ్స్‌ మార్చుకోండి!

ప్రభుత్వానికి వ్యతిరేకంగా..

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అణచివేతనూ, నిర్బంధాన్ని అమలు చేస్తున్నదన్నారు. రైతాంగ వ్యతిరేక చట్టాలను రుద్దాలని ప్రయత్నించిందని, 29 చట్టాలను 4 కోట్లుగా మలిచి కార్మికులకు వ్యతిరేకంగా, యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. నిరుద్యోగాన్ని పెంచుతున్నదని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలపై, ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో వండలాది మందిని ఆదివాసులనూ, మావోయిస్టులను హత్య చేస్తున్నదన్నారు.

అణచివేతను ప్రశ్నిస్తూ..

Advertisement

ఈ విషయమై వామపక్ష పార్టీలుగా ఉద్యమిస్తున్నామన్నారు. అణచివేతను ప్రశ్నిస్తున్నామన్నారు. ప్రకటన విడుదల చేసిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.రమ, సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సూర్యం, ఎంసీపీఐయూ నేత గాదగోని రవి, సూసి సి నేత మురహరి, ఆర్ ఎస్ పీ నేత జానకి రాములు, సీపీఐ (ఎం.ఎల్) నేత ప్రసాదన్న, లిబరేషన్ నేత రమేష్ రాజా ఉన్నారు.

Also Read: కౌశిక్ రెడ్డివి దొంగ దీక్షలు.. డంపింగ్ యార్డ్ వెనుక ఉన్న అసలు కథ ఇదే..?

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×