E-Paper
Advertisement

Trisha – Vijay: జ్ఞానోదయం అయింది.. విజయ్ – త్రిష రిలేషన్ పై డైరెక్టర్ ఊహించని కామెంట్!

Trisha – Vijay: జ్ఞానోదయం అయింది.. విజయ్ – త్రిష రిలేషన్ పై డైరెక్టర్ ఊహించని కామెంట్!
Advertisement

Trisha – Vijay: అటు కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో.. ఇటు తమిళనాడు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన ఏకైక అంశం విజయ్ (Vijay thalapathy), త్రిష (Trisha)రిలేషన్. ముఖ్యంగా విజయ్ తో త్రిష రిలేషన్ లో ఉందని.. గత కొన్ని నెలలుగా వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు విజయ్ భార్య సంగీత (Sangeetha) కూడా విజయ్ త్రిషతో రిలేషన్ కొనసాగిస్తున్నాడు అనే కారణంతోనే ఆమె విడాకులకు అప్లై చేసింది అనే వార్తలు బలంగా వినిపించాయి..పైగా ఏప్రిల్ 20వ తేదీన విజయ్ విచారణకు హాజరుకావాలని కోర్టు కూడా నోటీసులు పంపించినట్లు సమాచారం.

త్రిష – విజయ్ ల లపై వస్తున్న రూమర్స్ కి స్పందించిన డైరెక్టర్..

దీనికి తోడు అటు రాజకీయంగా కూడా విజయ్ ను దెబ్బతీసేందుకు ప్రత్యర్ధులు త్రిషను పావుగా వాడుతున్నారనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మొన్నటికి మొన్న ఒక బీజేపీ లీడర్ “త్రిష ఇంటి నుంచి విజయ్ బయటకు రావాలి” అని కామెంట్ చేశారు. అలాగే సముద్రఖని కూడా విజయ్ – త్రిష బంధం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డైరెక్టర్ ఆర్. పార్థీబన్ కూడా విజయ్ – త్రిష రిలేషన్ గురించి మాట్లాడి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.. ఇలా రాజకీయంగా, సినిమా ఇండస్ట్రీ పరంగా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు వీరిద్దరిని టార్గెట్ చేస్తూ పలు రకాల కామెంట్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఒక స్టార్ డైరెక్టర్ వీరి బంధంపై పాజిటివ్గా స్పందించడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

ఆ హక్కు మనకు లేదంటూ..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. గత కొన్ని రోజులుగా విజయ్ – త్రిష వ్యక్తిగత జీవితాల పై వస్తున్న రూమర్ల గురించి దర్శకుడు విక్రమ్ భట్ (Vikram bhat) స్పందించారు. ఆయన మాట్లాడుతూ..” నటీనటుల సినిమాలు మాత్రమే మనవి. వారి వ్యక్తిగత జీవితాలను జడ్జ్ చేసే హక్కు ఎవరికీ లేదు. ” అంటూ తెలిపారు. ఇకపోతే ఇటీవల చీటింగ్ కేసులో జైలు జీవితం గడిపిన ఈయన..” స్వేచ్ఛ విలువ ఏంటో నాకు అర్థం అయింది. తోటి మనుషులపై అనవసరమైన విమర్శలు మానుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నాను” అంటూ విక్రమ్ భట్ పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం విజయ్ – త్రిష గురించి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వారి మధ్య ఏది ఉందో ఏది లేదో తెలియదు కానీ వారి వ్యక్తిగత విషయాలను బయటకు తీస్తూ కామెంట్ చేసే హక్కు మనకు లేదు అంటూ ఆయన హితవు పలికారు. మరి ఇప్పటికైనా విజయ్ – త్రిష పై వస్తున్న రూమర్స్ ఆగిపోతాయేమో చూడాలి.

ALSO READ:Richest Actresses: టాప్ 10 అత్యధిక ధనవంతుల జాబితా.. మీ ఫేవరెట్ హీరోయిన్ ఆస్తి ఎంతంటే?

త్రిష – విజయ్ బంధంపై స్పందించిన సింగర్ సుచిత్ర..

Advertisement

ఇదిలా ఉండగా ప్రముఖ సింగర్ సుచిత్ర “సుచీ లీక్స్” పేరిట ఎన్నో విషయాలను బయటపెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె కూడా వీరిద్దరి రిలేషన్ పై స్పందించింది. త్రిష విజయ్ తో రిలేషన్ లో లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఆమె మరొకరితో రిలేషన్ లో ఉంది. విజయ్ తో రిలేషన్ లో లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. మొత్తానికైతే విజయ్ త్రిష బంధం పై వస్తున్న రూమర్స్ ఎప్పటికి పుల్ స్టాప్ పడతాయో చూడాలి.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×