E-Paper
Advertisement

Lava Bold 2 5G: రూ.11వేలకే అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ ఫోనా? ఫీచర్లు చూస్తే మతి పోతుంది!

Lava Bold 2 5G: రూ.11వేలకే అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ ఫోనా? ఫీచర్లు చూస్తే మతి పోతుంది!
Advertisement

Lava Bold 2 5G: దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా తన కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ 5G ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ‘Lava Bold 2 5G’ పేరుతో రాబోతున్న ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో దీనికి సంబంధించిన ప్రత్యేక పేజీ కూడా ప్రత్యక్షమైంది. గతేడాది విడుదలై మంచి ఆదరణ పొందిన లావా బోల్డ్ 5Gకి కొనసాగింపుగా వస్తున్న ఈ ఫోన్.. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లను కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్ కానుంది.

మార్చి 13న గ్రాండ్ ఎంట్రీ..

అమెజాన్ మైక్రోసైట్ సమాచారం ప్రకారం.. Lava Bold 2 5G ఈ నెల 13న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో అడుగు పెట్టనుంది. నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ, ఈసారి ఫోన్ డిజైన్ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సెక్యూరిటీ పరంగా దీనిలో అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను అందించబోతున్నారు. బడ్జెట్ ధరలో ఇలాంటి హై ఎండ్ ఫీచర్ రావడం వినియోగదారులకు కలిసొచ్చే పెద్ద అంశమే మరి.

Advertisement

Also Read: మీ ఫోన్ మీ సీక్రెట్స్ వింటోందా? ఈ చిన్న గ్యాడ్జెట్‌తో ఆడియో రికార్డింగ్‌కు చెక్ పెట్టండి!

స్టైలిష్ లుక్, డిజైన్..

Lava Bold 2 5G ఫోన్ లుక్ చూస్తేనే టెక్ లవర్స్ ఫిదా అయిపోతారు. స్క్రీన్ పైభాగంలో సెల్ఫీ కెమెరా కోసం హోల్ పంచ్ కటౌట్ ఇచ్చారు. ఫోన్ చుట్టూ ఉండే బెజెల్స్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ, కింద వైపు మాత్రం కొంచెం మందంగా అనిపిస్తుంది. వెనుక వైపు రెక్టాంగ్యులర్ కెమెరా ఐలాండ్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సైడ్ ఫ్రేమ్, బ్యాక్ ప్యానెల్ ఫ్లాట్ డిజైన్‌తో ఉండటం వల్ల ఫోన్ పట్టుకోవడానికి చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది.

బడ్జెట్ ధరలోనే..

Advertisement

ప్రస్తుతానికి కంపెనీ కేవలం లాంచ్ తేదీ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ గురించి మాత్రమే స్పష్టత ఇచ్చింది. గతేడాది వచ్చిన మోడల్ 5,000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చినందున, ఈ కొత్త వెర్షన్‌లో అంతకంటే మెరుగైన ఫీచర్లే ఉంటాయని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ధర విషయంలో లావా షాక్ ఇచ్చే అవకాశం ఉంది. గతేడాది మోడల్ రూ.10,499 ప్రారంభ ధరకే లభించినందున.. ఇప్పుడు వస్తున్న ఈ కొత్త ఫోన్ కూడా ఆఫర్లతో కలిపి ఖచ్చితంగా రూ.11వేల లోపు ధరకే వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ ఫోన్ బ్లాక్ కలర్ వేరియంట్‌లో లభ్యం కానుంది. కెమెరా మెగాపిక్సెల్స్, ప్రాసెసర్ వివరాలు లాంచ్ రోజున వెల్లడి కానున్నాయి.

Also Read: రూ.8 లక్షల టీవీ చూశారా? సోనీ బ్రావియా రేంజ్ ఫీచర్లతో TCL సంచలనం!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×