E-Paper
Advertisement

Raviteja:నవ్వించడం అవ్వడం లేదు.. ఈ సారి రవన్న భయపెడతాడంట

Raviteja:నవ్వించడం అవ్వడం లేదు.. ఈ సారి రవన్న భయపెడతాడంట
Advertisement

Raviteja: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Raviteja)ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా తన టాలెంట్ తో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక రవితేజ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలో ఉన్నాయి. ఇక ఒక సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి అంటే ఎప్పుడూ ఒకే నేపథ్యంలో కాకుండా విభిన్న జానర్ లో సినిమా చేస్తేనే ప్రేక్షకులు కూడా సినిమా చూడటానికి ఇష్టపడతారు. అయితే రవితేజ సినిమాల విషయంలో మాత్రం కొత్తదనం మిస్ అవుతుందనే చెప్పాలి. ఇటీవల కాలంలో రవితేజ సినిమాలన్నీ ఒకే జోనర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈయన సినిమాలకు సరైన ఆదరణ లభించడం లేదు.

హర్రర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ?

రవితేజ సక్సెస్ అందుకొని కూడా కొన్ని సంవత్సరాలు అవుతుంది. రవితేజ శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించిన ధమాకా సినిమా తర్వాత దాదాపు ఒక అర డజను సినిమాల ద్వారా రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాలేవి కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇటీవల ఎన్నో అంచనాల నడుమ విడుదలైన మాస్ జాతర ప్రేక్షకులను నిరాశపరిచింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇలా కామెడీ ఎంటర్టైనర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న రవితేజ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడంతో ఈసారి ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

రవితేజ కోసం వివేక్ ఆత్రేయ…

Advertisement

రవితేజ కొత్త సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈసారి ఈయన హర్రర్ జానర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రవితేజ కోసం ఒక హర్రర్ స్క్రిప్ట్ సిద్ధం చేశారని ఇటీవల రవితేజను కలిసి స్క్రిప్ట్ నేరెట్ చెయ్యగా రవితేజ కూడా ఇంప్రెస్ అయ్యారని తెలుస్తోంది. ఇలా కథ నచ్చడంతో దాదాపు రవితేజ ఈ హర్రర్ సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.

శివ నిర్వాణతో రవితేజ సినిమా..

Advertisement

ఇలా ఇన్ని రోజులు తన నటనతో యాక్షన్, కామెడీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ప్రేక్షకులను థియేటర్లలో ఆకట్టుకోలేకపోయిన నేపథ్యంలోనే ఈసారి భయపెట్టడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక ప్రస్తుతం రవితేజ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు ఇరుముడి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా తండ్రీ కూతురి బాండింగ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం రవితేజ కుమార్తె మోక్షద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నారు.

Also Read: Parasakthi film: పరాశక్తి ఫస్ట్ ఛాయిస్ శివ కార్తికేయన్ కాదా..ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Related News

శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ఆకట్టుకుంటున్న ‘దేవరాయ’ టైటిల్ గ్లింప్స్ అండ్ ఫస్ట్ లుక్!

78వ ఎమ్మీ అవార్డ్స్ తుది జాబితా.. అత్యధిక నామినేషన్స్ అందుకున్న షోలు!

హాస్పిటల్ పాలైన మమితా బైజు.. వీడియో వైరల్!

హరికృష్ణ 70వ జయంతి..ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్!

ఐదుసార్లు చావును దగ్గరగా చూశాను.. అదే నాకు ఇంపార్టెంట్.. హీరో కామెంట్స్..

“ప్రజలు మెచ్చిన నాయకుడు”.. పవన్ కళ్యాణ్ కు చిరంజీవి స్పెషల్ బర్త్‌డే విషెస్!

Poojitha Ponnada : గార్జీయస్ లుక్ లో మెరిసిపోతున్న పూజిత.. కుర్రాళ్ళు ఏమైపోతారమ్మా..!

HBD Pawan Kalyan : బర్త్ డే స్పెషల్.. ఆ ఒక్కటే పవర్ స్టార్ ను చేసిందా..?

Big Stories

Advertisement
×