E-Paper
Advertisement

Viral News: సింగిల్ బెడ్రూం అపార్ట్ మెంట్ జస్ట్ రూ.9,000కే.. మరీ ఇంత తక్కువ ఎలా బ్రో?

Viral News: సింగిల్ బెడ్రూం అపార్ట్ మెంట్ జస్ట్ రూ.9,000కే.. మరీ ఇంత తక్కువ ఎలా బ్రో?
Advertisement

ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాల్లోనే సింగిల్ బెడ్ రూమ్ అద్దె, సుమారు రూ. 5 వేల వరకు ఉంటుంది. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఈ ధర ఏకంగా రూ. 10 వేలకు పైనే ఉంటుంది. ఇక ఫర్నీచర్ ఉంటే, ఏకంగా రూ. 20 వేల వరకు ఉంటుంది. కానీ, చైనాలో పూర్తిగా ఫర్నీచర్ తో ఉన్న సింగిల్ బెడ్ రూమ్ అద్దె కేవలం రూ. 10 వేల లోపే అంటే నమ్ముతారా? ఆశ్చరంగా ఉన్నా ఇది నిజం. సెకండ్ టైర్ చైనీస్ నగరాల్లో సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్‌ మెంట్ అద్దెకు నెలకు $109 (భారతీయ కరెన్సీలో రూ.9916) మాత్రమే. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే?

జు జెన్కింగ్ అనే వ్యక్తి Xలో ఈ వీడియోను షేర్ చేశాడు. ఇతర దేశాలతో పోలిస్తే చైనాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత తక్కువగా ఉందో చెప్పే ప్రయత్నం చేశాడు. “సెకండ్ టైర్ చైనీస్ సిటీలోని ఈ స్టూడియో అపార్ట్‌ మెంట్‌ ను నెలకు దాదాపు 780 యువాన్ల(రూ.10,814) అద్దె తీసుకోవచ్చు” అని ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టాడు. ఈ క్లిప్ 4.4 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోపై రియాక్ట్ అయ్యారు. తక్కువ అద్దెకు మంచి సదుపాయాలు కల్పించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వీడియోలో కాంపాక్ట్ అపార్ట్‌ మెంట్ శుభ్రమైన, చక్కగా మెయింటెన్ చేసే ప్లేస్ ను కలిగి ఉంది. ఇందులో చిన్న వంటగది, బాత్రూమ్, చక్కటి బెడ్ రూమ్, ఇంటికి అవసరం అయిన ఫర్నిచర్ వస్తువులు ఉన్నాయి.

నెటిజన్లు ఏమంటున్నారంటే?

Advertisement

ఈ అపార్ట్‌ మెంట్ వీడియో, ఇతర దేశాల్లోని నగరాల్లో రెంట్ల గురించి చర్చకు కారణం అయ్యింది. నెటిజన్లు చైనా, యుఎస్, ఇండియా కాస్ట్ ఆఫ్ లివింగ్ తో పోల్చుతున్నారు.  మన దేశంలో ఇలాంటి అపార్ట్ మెంట్ ఆ ధరలో పొందడం చాలా కష్టం అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “ఇది ఏ నగరం? ఇది బీజింగ్? షాంఘై? చైనాలోని టైర్-3 నగరమైతే, భారతదేశంలోని టైర్-3 నగరంలో రూ. 5,000 అద్దె కూడా ఎక్కువే అంటారు” అని రాసుకొచ్చాడు.

Advertisement

అటు మరో నెటిజన్ “యుఎస్‌లో, నలుగురు ఉన్న కుటుంబానికి  ఫాస్ట్ ఫుడ్ ఖర్చే $109 (రూ. 9916) ఉంటుంది” అని రాసుకొచ్చాడు.  “ఇలాంటి అపార్ట్‌ మెంట్ రెంట్ యుఎస్ నగరాల్లో కనీసం 15 రెట్లు ఎక్కువ” అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. మరికొంత మంది నెటిజన్లు కూడా చైనాకు వెళ్లడం బెటర్ అని అభిప్రాయపడ్డారు. మరొక నెటిజన చైనాతో పోల్చితే  ఇతర దేశాలలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ అన్నాడు. “ నా పిల్లలకు వారం డైపర్ల ఖర్చే 110$ (రూ. 10007)” అని చెప్పుకొచ్చాడు.  అగ్ర రాజ్యం అని చెప్పుకునే అమెరికాలోనూ చాలా మంది రోడ్ల మీద పడుకుంటారని, చైనాలో రోడ్ల మీద ఎవరూ పడుకోకపోవడానికి కారణం అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉండటమేనని మరికొంత మంది అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఈ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

Read Also: అక్కడ అర్థరాత్రి పూట నీళ్లు మిలమిల మెరుస్తాయ్, నిజంగా ఇదో వండర్!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×