E-Paper
Advertisement

Parasakthi film: పరాశక్తి ఫస్ట్ ఛాయిస్ శివ కార్తికేయన్ కాదా..ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Parasakthi film: పరాశక్తి ఫస్ట్ ఛాయిస్ శివ కార్తికేయన్ కాదా..ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Advertisement

parasakthi film: తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న శివ కార్తికేయన్ (Sivakarthikeyan) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలు కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ శివ కార్తికేయన్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇక ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శివ కార్తికేయన్ నటించిన పరాశక్తి (Parasakthi)సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. జనవరి 10వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

హిందీ ఉద్యమ నేపథ్యంలో..

ఇలా సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర(Sudha Kongara) దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇందులో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా జయం రవి విలన్ పాత్రలో సందడి చేశారు. ఇక ఈ సినిమా తమిళనాడులో జరిగిన హిందీ ఉద్యమ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. టాక్ పరంగా, కలెక్షన్ల పరంగా ఈ సినిమా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని డైరెక్టర్ సుధా కొంగర బయటపెట్టారు. పరాశక్తి సినిమా కోసం ముందుగా అనుకున్న హీరో శివ కార్తికేయన్ కాదని ఈమె తెలియజేశారు.

విజయ్ దేవరకొండను సంప్రదించిన డైరెక్టర్ ..

Advertisement

శివ కార్తికేయన్ కాకుండా ఈ సినిమా కోసం ముందుగా సుధా కొంగర టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండను సంప్రదించారట. అదే సమయంలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా చేస్తున్న నేపథ్యంలో డేట్స్ క్లాష్ అవుతాయని తదుపరి శివ కార్తికేయన్ ను సంప్రదించడంతో శివ కార్తికేయన్ కు కథ నచ్చడంతో ఈ సినిమా చేసినట్టు తెలియజేశారు. ఇలా సుధా కొంగర ఈ విషయాన్ని బయట పెట్టడంతో విజయ్ దేవరకొండ అభిమానులు షాక్ అవుతున్నారు. ఏంటి ఈ సినిమాని విజయ్ చేయాల్సి ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కింగ్డమ్ సినిమా వల్ల చేయలేకపోయారా?

Advertisement

ఇక విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కింగ్డమ్ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ అభిమానులు ఈ సినిమాకు బదులుగా పరాశక్తి చేసి ఉంటే బాగుండేది అంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక పరాశక్తి సినిమా తెలుగులో కూడా విడుదల కావాల్సి ఉండగా సంక్రాంతి బరిలో తెలుగు ఇండస్ట్రీ నుంచి వరుస సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో తెలుగు విడుదలకు నోచుకోలేదు. అతి త్వరలోనే ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కాబోతుందని తెలుస్తోంది.

Also Read: Maruthi: రాజా సాబ్ డిజాస్టర్… మెగా హీరోని లైన్ లో పెట్టిన మారుతి.. అసలు నిజం ఇదే ?

Related News

కీర్తి సురేష్ పుట్టినరోజు స్పెషల్.. ‘అక్క’ టీజర్ రిలీజ్ !

ఇండస్ట్రీలో విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ ‘దేవా’ కన్నుమూత!

హార్ట్ టచ్ ఫీలింగ్.. ఆకట్టుకుంటున్న దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్!

కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. వారికి ప్రత్యేక ఆహ్వానం!

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

Big Stories

Advertisement
×