Disco Suchitra : ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రిటీలు తమ సినిమాలను ఇంటిపేరుగా పెట్టుకుంటున్నారు.. ఇక కొంతమంది డాన్సర్లు తమ డాన్స్ నే పేరుగా పెట్టుకుంటారు.. అలా తన డాన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న డాన్సర్ అంటే టక్కున గుర్తుచేది డిస్కో శాంతి.. 80 దశకంలో సినిమాల్లో డిస్కో పాటలకు స్టెప్‌లు వేసి అలరించింది. శ్రీహరిని ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఆమెకు ఒక సోదరి కూడా ఉన్నారు. అక్కలాగే తాను కూడా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ డివోషనల్ కార్యక్రమాలను చేస్తుంది. ఆమె పేరు డిస్కో సుచిత్ర.. ఈమె ఇటీవల స్క్రీన్ మీద కనిపించడం లేదు కానీ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది.. ఆ ఇంటర్వ్యూలో ఆమె పరమశివుడి గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. తన బాడీపై ఉన్న టాటు ల గురించి వివరించింది. ఆమె ఆ ఇంటర్వ్యూ లో ఏం చెప్పారో ఒకసారి తెలుసుకుందాం..
డిస్కో సుచిత్ర గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె కూడా అక్క బాటలోనే నడిచింది. చెన్నైలో ఉండే సుచిత్ర.. తమిళంలో సినిమాలు చేసింది. ఈమెకు తెలుగులో కూడా అవకాశాలు వచ్చాయి కానీ వాటిని రిజెక్ట్ చేసింది అయితే హీరోయిన్ గా కన్నా డాన్సర్ గానే ఆమె ఎక్కువగా సినిమాలు చేసింది గతంలో అడపా సినిమాలతో అలరించిన ఈమె ప్రస్తుతం స్క్రీన్ కి చాలా దూరంగా ఉంది. సినిమాలను వదిలేసిన సుచిత్ర ప్రస్తుతం శివ భక్తురాలుగా మారింది. డివోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటూ దేవుడు ఈ స్మరణతో జీవితాన్ని గడుపుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన టాటూ గురించి బయట పెట్టింది. ఆమె మాట్లాడుతూ తన ఒంటినిండా 12 టాటూలు ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఆ టాటూలన్నీ కూడా చిన్న చిన్నవే కానీ వీపు పైన చాలా పెద్ద శివయ్య టాటూ ఉందని చెప్పింది.. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో ఆ టాటూ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి..
Also Read : మాధవ్ ను అవమానించిన తాయారు.. మహాను మోసం చేస్తున్న చక్రీ.. పోలీసుల మాటతో షాక్..
ఒకప్పుడు సినిమాలలో ఐటమ్ గర్ల్ గా ఎన్నో పాటలలో కనిపించిన ఈ అమ్మడు ప్రస్తుతం పరమశివుడు భక్తురాలుగా మారిపోయింది.. సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం భక్తి మోక్షానికి మార్గం అంటూ దేవుడిని స్మరిస్తూ ఉంటుంది. ఇంటర్వ్యూలో ఆమె తనకు శివుడు అంటే చాలా ఇష్టమని చెప్పింది. శివుడి టాటూ ని నా వీపు మీద వేయించుకున్న తర్వాత నేను ఆరు నెలలు తీవ్రంగా బాధపడ్డాను. నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ మిగులుతుంది కాబట్టి.. ఆ బాధని నేను బాగా మర్చిపోలేక పోతున్నాను. ఆరు నెలల వరకు ఆ టాటూ ఎఫెక్ట్ నాకు అలానే ఉండిపోయిందని ఆమె అన్నారు.. ఇక టాటూ వేసుకున్న తర్వాత నాన్ వెజ్ ను తినడమే పూర్తిగా మానేశాను అని ఆమె అన్నారు. ప్రస్తుతం నేను నా దివ్య దృష్టితో శివయ్యతో కూడా మాట్లాడతాను అని ఆమె అనడం హాట్ టాపిక్ గా మారింది.. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దీనిపై నెటిజన్లు కూడా భిన్నంగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.. ప్రస్తుతం ఈమె సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం కానిస్టేబుల్ కనకం సినిమా లో నటించింది.. ఇక యూట్యూబ్ కి ఇంటర్వ్యూ వచ్చింది. ఇకముందు సినిమాలతో బిజీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.