E-Paper
Advertisement

MLA Arava Sridhar: అజ్ఞాతంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. ఫోన్ స్విచ్ఛాఫ్, కమిటీ ముందుకొస్తారా?

MLA Arava Sridhar: అజ్ఞాతంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. ఫోన్ స్విచ్ఛాఫ్, కమిటీ ముందుకొస్తారా?
Advertisement

MLA Arava Sridhar: రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎక్కడ? ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లారు? ఆయనపై వస్తున్న విమర్శలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఆ పార్టీ వేసిన కమిటీ ముందుకైనా ఆయన వస్తారా? మహిళ ఆరోపణలను తిప్పికొడతారా? ఇవే ప్రశ్నలు ఆ నేతలను వెంటాడుతున్నాయి.

అజ్ఞాతంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్?

Advertisement

రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. తనపై ఓ మహిళ చేసిన ఆరోపణపై వివరణ ఇస్తూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన తన ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్టు తెలుస్తోంది. నియోజకవర్గానికి చెందిన నేతలు ఫోన్ చేస్తుంటే స్విచ్ఛాఫ్ అని వస్తోందని అంటున్నారు.

ఒక్కోసారి ఔటాప్ సర్వీసు అని వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన న్యాయవాదుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వారిచ్చిన సలహాల మేరకు రేపో మాపో ఆయన బయటకు వచ్చే అవకాశముందని అంటున్నారు శ్రీధర్ అనుచరులు. మరోవైపు శ్రీధర్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ ఓ కమిటీని నియమించింది.

Advertisement

శ్రీధర్ ఫోన్ స్విచ్ఛాఫ్.. న్యాయనిపుణులతో సంప్రదింపులు

వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పార్టీ కమిటీ ముందుకు అరవ శ్రీధర్ వస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో తొలుత కుటుంబసభ్యులను పిలిచి వారి వెర్షన్ తీసుకోవాలని ఆలోచన చేస్తోందట జనసేన. చివరకు శ్రీధర్‌ నుంచి వివరణ తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా జనసేన మద్దతుదారులు బాధిత మహిళతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.  జనసేనను బద్నామ్ చేయడానికి ప్రత్యర్థులు వేసిన ఎత్తుగా చెబుతున్నారు. ఈ క్రమంలో బాధిత మహిళ కొన్ని విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది. జనసేన మద్దతుదారులు మాత్రం ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్న వారిపై విచారణ చేయించాలని పట్టుబడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై బాధిత మహిళ గురువారం మీడియా ముందుకొచ్చే అవకాశముందని అంటున్నారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×