BigTV English

Samantha: సమంత సెకండ్ హ్యాండ్.. డిజైనర్ సంచలన వ్యాఖ్యలు

Samantha: సమంత సెకండ్ హ్యాండ్.. డిజైనర్ సంచలన వ్యాఖ్యలు

Samantha: స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ వరుస సినిమాలతో టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్ గా మారింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకుంది. కలకాలం కలిసి ఉంటారు అనుకున్న ఈ జంట నాలుగేళ్లు కూడా కలిసి లేకుండా విడాకులు తీసుకొని విడిపోయారు.  విడాకుల తర్వాత సమంతను సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన విషయం తెలిసిందే.  ఈ విడాకుల వలన సామ్  ఎంతో ఒక క్షోభను అనుభవించింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.


 

విడాకులకు కారణం ఆమె అని  ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకున్నారు. సమంతకు వేరొకరితో ఎఫైర్ ఉందని, ఆ విషయం తెలిసి నాగార్జునకు తెలిసి పద్ధతి మార్చుకోవాలని చెప్పినా కూడా ఆమె వినకుండా బాలీవుడ్ లో ఇంటిమేట్ సీన్స్  కూడా చేయడంతో అక్కినేని ఫ్యామిలీ ఫైర్ అయిందని, నాగార్జున చొరవతో నాగచైతన్య, సమంతకు విడాకులు ఇచ్చాడని వార్తలు వచ్చాయి. ఇంకొంతమంది అయితే సమంత ను అక్కినేని ఫ్యామిలీ వేధిస్తుందని, ఆ బాధను తట్టుకోలేక సమంత బయటకు వచ్చేసిందని ఇలా రకరకాల పుకార్లను సృష్టించారు. అయితే ఈ జంట విడాకులకు అసలైన కారణం ఇప్పటివరకు తెలియరాలేదు. కానీ, ఇప్పటికీ సమంత గురించిన ఏ వార్త వచ్చిన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది.


 

ఇవన్నీ పక్కన పెడితే గతం గతః అంటూ ఈ జంట ఎవరికి వారు వారి కెరీర్ లో బిజీగా మారారు. నాగచైతన్య వరుస సినిమాలతో బిజీగా మారడమే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో మంచి విజయాన్ని అందుకున్నాడు అంతేకాకుండా నటి శోభితను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు. సామ్ మాత్రం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి చై జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా చెరిపేస్తూ వస్తుంది. ఫోటోలు ఇప్పటికే డిలీట్ చేసిన సమంత తన వెడ్డింగ్ గౌన్ కూడా పార్టీ వేర్ డ్రెస్ గా మార్చేసింది. అయితే అది ఆమె ఐడియా కాదని డిజైనర్ క్రేషా బజాజ్ ఇచ్చిన ఐడియా అంటూ వార్తలు వచ్చాయి.

 

తాజాగా క్రేషా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడింది. అది తన ఐడియా కాదని సమంత ఐడియానే అని చెప్పుకొచ్చింది. “నాగచైతన్యతో విడాకుల తర్వాత ఆమె ఆ జ్ఞాపకాలనుంచి బయటపడాలనుకుంది.  అందులో ఎంతో జ్ఞాపకంగా దాచుకున్న వెడ్డింగ్ గౌన్ ను  కూడా వదిలించుకోవాలని ప్రయత్నించింది. కానీ, ఆ గౌన్ తో ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఆమెను ఆ  పని చేయించలేకపోయింది. దీంతో  ఆ గౌనును నా దగ్గరకు తీసుకొచ్చి పార్టీ డిజైనర్ డ్రెస్ గా మార్చమని చెప్పింది. నేను ఆమె చెప్పినట్లే చేశాను.

 

సమంత విడాకుల తర్వాత ఎంతో ట్రోలింగ్ గురైంది. ముఖ్యంగా ఆమెను చాలామంది సెకండ్ హ్యాండ్ అంటూ విమర్శించారు. సెకండ్ హ్యాండ్ అని అనడంతో సమంత చాలా బాధపడింది. ఎన్నోసార్లు ఈ విషయాన్ని నాతో చెప్పుకొని బాధపడింది. కానీ అధైర్యపడకుండా  ఎవరైతే సెకండ్ హ్యాండ్ అని అన్నారో  వారి ముందే ఈ సెకండ్ హ్యాండ్ గౌను ధరించి వారందరికీ  గట్టి దెబ్బకొట్టింది. ఇది కేవలం సమంతబాధ  మాత్రమే కాదు విడాకులైన ప్రతి మహిళ బాధ”  అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఏ వ్యాఖ్యలు నెత్తిన వైరల్ గా మారాయి. ఇకపోతే స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు  కొనసాగిన సామ్ ఇప్పుడు ఒక సినిమా కూడా చేయలేకపోతోంది. మరి సామ్ కెరీర్ పై ఫోకస్ చేస్తుందా.. ?అనేది చూడాలి.

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×