BigTV English

Sreeleela Lenin Movie : లెనిన్ నుంచి శ్రీలీల అవుట్… ఆమె కెరీర్‌ను వాళ్ల అమ్మే నాశనం చేస్తుందా ?

Sreeleela Lenin Movie : లెనిన్ నుంచి శ్రీలీల అవుట్… ఆమె కెరీర్‌ను వాళ్ల అమ్మే నాశనం చేస్తుందా ?

Sreeleela Lenin Movie : టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్గా సక్సెస్ అయింది. అయితే స్టార్ హీరోల సరసన నటించిన కానీ ఆమె ఖాతాలో సరైన హిట్ సినిమా పడలేదు. దాదాపు ఏడాది గ్యాప్ తీసుకుని మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవ్వాలని శ్రీలీల ప్రయత్నాలు చేస్తుంది.. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు మూడు భారీ ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసిందే. కేవలం తెలుగులో మాత్రమే కాదు.. అటు బాలీవుడ్ లోనూ.. కోలీవుడ్ లోనూ సినిమాలతో బిజీ అవ్వాలని ట్రై చేస్తుంది. అయితే శ్రీలీల గురించి ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం..


అఖిల్ లెనిన్ నుంచి శ్రీలీల అవుట్..?

శ్రీలీల ప్రస్తుతం భారీ ప్రాజెక్టులలో నటిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కథానాయకగా నటిస్తుంది.. దీంతోపాటు అఖిల్ అక్కినేని నటిస్తున్న లెనిన్ చిత్రం కూడా ఉంది. ఇవి కాకుండా కోలీవుడ్ చిత్రంతో పాటు బాలీవుడ్ లో కూడా మరో రెండు ప్రాజెక్టులలో నటిస్తుంది. అయితే ఈమధ్య తెలుగు సినిమాల్లో పెద్దగా పేరు రాకపోవడంతో ఈమె కేవలం తమిళ్, హిందీ చిత్రాలపైనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అందుకు కారణం కూడా ఉంది. ప్రస్తుతం ఈమె తెలుగులో నటిస్తున్న లెనిన్ చిత్రం నుంచి తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా నుంచి శ్రీలలను తప్పించి వేరే హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం.. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకోడానికి కారణం ఆమె తల్లి అని ఓ వార్త అయితే నెట్టింట ప్రచారంలో ఉంది..


Also Read :రోజాను కొట్టిన బుడ్డది.. కారణం తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..!!

శ్రీలీల ఎందుకు ఇలా చేస్తుంది..? 

శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతుంది. తెలుగు, హిందీ, తమిళ్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది. మిగిలిన భాషల్లో సినిమాల పై ఫోకస్ చెయ్యడంతో తెలుగు సినిమాలకు సరిగ్గా డేట్స్ ఇవ్వలేక పోతుంది. అయితే ఇక్కడ ఓ వార్త వినిపిస్తుంది. శ్రీలీల మొదటి నుంచి అమ్మచాటు బిడ్డనే. మొదటినుంచి ఆమె కెరియర్ ని ముందుకు తీసుకెళ్లడానికి తల్లి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు ఆమెని తెలుగు సినిమాలను పక్కనపెట్టి బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ చేయమని చెబుతుందని నిర్మాతల నుంచి వినిపిస్తుంది. ఒకప్పుడు హీరో తరుణ్ విషయంలో కూడా తన తల్లి చేసిన తప్పుని ఇప్పుడు శ్రీలీల తల్లి కూడా చేస్తుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. కేవలం శ్రీలీల డేట్స్ సరిగ్గా ఇవ్వకపోవడంతోని లెనిన్ చిత్రంలో వేరే హీరోయిన్ ను తీసుకురాబోతున్నట్లు టాక్.. మరి ఈ వార్తలు పై శ్రీలీలా ఎలా స్పందిస్తుందో చూడాలి…

Related News

Udaipur files: వివాదాల నడుమ థియేటర్ లోకి వచ్చిన ఉదయ్ పూర్ ఫైల్స్.. ఎలా ఉందంటే?

Mega Heroes: ఒకే ప్రేమ్ లో మెగా హీరోస్.. ట్రెండింగ్ లో పెద్ది మూవీ!

Arundhati: పెళ్లికి సిద్ధమైన అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. బ్యాచిలర్ పార్టీలో రచ్చ రచ్చ!

Ajith -Shalini: నా హృదయాన్ని కరిగించావ్.. అజిత్ కాళ్ళు మొక్కిన షాలిని..

Kiara Advani: నేను డైపర్లు మారిస్తే.. నువ్వేమో.. అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న కియారా!

Coolie Film: సింగపూర్ లో కూలీ హవా.. పవర్ హౌస్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చిన పోలీసులు.. వీడియో వైరల్!

Big Stories

×