E-Paper
Advertisement

ఘరానా మొగుడు ఛాన్స్ మిస్.. అసలు కారణం చెప్పిన దివ్యవాణి!

ఘరానా మొగుడు ఛాన్స్ మిస్.. అసలు కారణం చెప్పిన దివ్యవాణి!
Advertisement

Divyavani Interview:దివ్యవాణి….ఇప్పటి తరానికి ఈ వెటరన్ హీరోయిన్ పెద్దగా తెలీకపోవచ్చేమో కాని 90s లో తనదైన అందం,అభినయంతో ఆడియన్స్ ని అలరించిన ఈ వెటరన్ భామ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినీ జర్నీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

ఈ క్రమంలో కెరీర్‌లో ఎదురైన అనుభవాలు,మిస్ అయిన సినిమా అవకాశాలు,కుటుంబం గురించి ఆమె మాట్లాడారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఘరానా మొగుడు’ సినిమాలో నటించే అవకాశం మిస్ కావడానికి గల కారణంపై ఆమె చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.

Advertisement

ఘరానా మొగుడు అవకాశం ఎందుకు మిస్ అయింది?

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఘరానా మొగుడు’ సినిమాలో నటించే అవకాశం తనకు వచ్చినప్పటికీ, ఆ అవకాశం చేజారిపోయిందని దివ్యవాణి తెలిపారు. అయితే, డేట్స్ సమస్య వల్లనో, తన ఎత్తు, అందం ఆ సినిమా మిస్ కాలేదని స్పష్టం చేశారు. ఆ అవకాశం ఎందుకు చేజారిందో అందరికీ తెలుసని ,వాళ్ళకి నచ్చినట్టుగా ఉండనందుకే ఆ ఛాన్స్ మిస్ అయిందని అయితే చాలా ఏళ్ళు గడిచిపోయినందు వల్ల ఇక దాని గురించి మాట్లాడుకుని లాభం లేదని చెప్పుకొచ్చారు.

Advertisement

అదే విధంగా బాపు–రమణల సినిమాల్లోనూ తనను తీసుకోవాలని వారు అనుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇతరులు ప్రెజర్ చేయడం వల్ల అవకాశాలు చేజారాయని బాధ పడిపోయారు..‘మిస్టర్ పెళ్లాం’ సినిమాలో తనను తీసుకోవాలని బాపు అనుకున్నప్పటికీ, హీరో వద్దన్నారని దివ్యవాణి వాపోయారు.అయితే ఆ అవకాశం దక్కకపోయినా, మరో హీరోయిన్‌కు మంచి అవకాశాలు వచ్చాయని, అందులోనూ సంతోషాన్ని వెతుక్కున్నానని ఆమె చెప్పడం విశేషం.

కొంతమంది హీరోల సినిమాలు ఎందుకు చేయలేకపోయారు?

తన సినీ జర్నీలో కొంతమంది హీరోలతో సినిమాలు చేసే అవకాశాలను కోల్పోవాల్సి వచ్చిందని దివ్యవాణి తెలిపారు. అయితే, అందుకు గల అసలు కారణాలను బయటపెట్టకుండా, అప్పట్లో తనకు చెప్పిన కారణాలు వేరుగా ఉండేవని, తెరవెనుక పరిస్థితులు మరోలా ఉండేవని వివరించారు. తనకు పనిచేసిన దర్శకుల్లో రేలంగి నరసింహారావు, పి.ఎన్. రామచంద్రరావు, కోదండ రామిరెడ్డి వంటి వారు ఎంతో గౌరవంగా ఉండేవారని తెలిపారు.

షూటింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న రోజులు

సినిమా షూటింగుల సమయంలో కొన్ని ఇబ్బందికర అనుభవాలు ఎదురయ్యాయని దివ్యవాణి బయటపెట్టారు.ముఖ్యంగా ఎదురింటి మొగుడు – పక్కింటి పెళ్లాం’ సినిమా షూటింగ్ టైమ్ లో కొంత ఇబ్బంది ఎదురై ఏడ్చానని ఆనాటి రోజులని గుర్తు చేసుకున్నారు.

అలాగే మరో సినిమా షూటింగ్‌లో తనకు ఉదయం ఏడు గంటలకు షూట్ ఉందని చెప్పడంతో త్వరగా వెళ్లానని,అక్కడికి వెళ్లిన తర్వాత తనకు సంబంధించిన పాట షూట్ వెంటనే లేదని తెలిసి ఇబ్బంది పడ్డానని వివరించారు. ఆ సమయంలో పెద్దవారితో ఎలా మాట్లాడాలో తెలియక చాలా టెన్షన్ పడ్డానని గుర్తుచేసుకున్నారు.

అయితే, ఇలాంటి పరిస్థితులు ఎదురైనా తనకు తల్లి ఎంతో ధైర్యం చెప్పేవారని, ఆ ప్రోత్సాహంతోనే ముందుకు వెళ్లానని తెలిపారు. తనతో పనిచేసిన హీరోల్లో చాలామంది ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా ఉండేవారని కూడా తెలిపారు.

సినిమా అవకాశాలు రాకపోయినా బాధపడలేదు!

కెరీర్‌లో కొన్ని అవకాశాలు మిస్ అయినప్పటికీ వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడి పోనని చెప్పారు. తాను అనుకున్నది జరగకపోతే దాని గురించి ఎక్కువగా పట్టించుకోకుండా, మనసును మరో పనిపై ఫోకస్ పెడతానని తెలిపారు.

తన తల్లి ఆరోగ్యం విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకునేవారని, నిమ్మరసం, క్యారెట్ జ్యూస్, తక్కువ ఫుడ్ తీసుకుంటూ షూటింగ్‌లకు వెళ్లేవాళ్లమని వివరించారు. అయితే, తనకు మంచి ఆహారం అంటే చాలా ఇష్టమని, ముఖ్యంగా ఇంట్లో చేసే గోంగూర మటన్, గోంగూర చికెన్, రోటి పచ్చళ్లు ఎంతో ఇష్టంగా తినేదాన్నని సరదాగా చెప్పారు.దివ్యవాణి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన పలు విషయాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

రవితేజ తల్లిగా దివ్యవాణి.. చివరికి ఏమైందంటే!

నా బెడ్ రూమ్ లో దెయ్యాలున్నాయి…షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన హీరో!

నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం..

రూ .1000 కోట్ల కల.. జైలర్ 2తో కోలీవుడ్ చరిత్ర సృష్టిస్తుందా?

మళ్లీ ఆ స్థానానికి వెళ్లలేవు.. త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ పోస్ట్!

రజినీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. జైలర్ 3 పై అఫీషియల్ అప్డేట్!

భార్య అంటే ఉచితంగా వచ్చే పనిమనిషా?- అనుపమ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×