Satellite Refuelling: అంతరిక్షంలోనూ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు కార్యరూపం ఇస్తోంది భారతీయ స్టార్టప్ OrbitAID Aerospace. ఈ కంపెనీ వ్యవస్థాపకుడు శక్తికుమార్ నేతృత్వంలో.. సుమారు 30 కిలోల బరువున్న AayulSAT-1A శాటిలైట్‌ను నవంబర్ 2026లో ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం Small Satellite Launch Vehicleను ఉపయోగించనున్నారు. శాటిలైట్ సిద్ధంగా ఉందని, వచ్చే వారం చివరి దశ పరీక్షలు పూర్తి చేసి.. ప్రయోగ ఏర్పాట్ల కోసం శ్రీహరికోటకు తరలించనున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ప్రయోగ తేదీ ఇంకా ఖరారు కాలేదు. నవంబర్ మధ్యలో ప్రయోగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ మిషన్‌లో రెండు శాటిలైట్ బస్సులు, రెండు ట్యాంకులతో పాటు డాకింగ్, రీఫ్యూయలింగ్ ప్రయోగాలకు అవసరమైన పరికరాలను పంపించనున్నారు. అంతరిక్షంలో రెండు వ్యవస్థలను అనుసంధానం చేయడం.. శాటిలైట్లోపలే ఇంధనాన్ని బదిలీ చేయడం పవర్, డేటా ట్రాన్స్ఫర్, ఇన్-ఆర్బిట్ ఇన్స్పెక్షన్ వంటి సామర్థ్యాలను పరీక్షించనున్నారు. సాధారణంగా శాటిలైట్‌లో ఇంధనం అయిపోతే దాని సేవలు పరిమితమవుతాయి. కానీ ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే మరో స్పేస్‌క్రాఫ్ట్ వెళ్లి డాక్ అయి, ఇంధనాన్ని నింపగలదు. తద్వారా శాటిలైట్ ఆపరేషనల్ లైఫ్ పెంచడంతో పాటు కొత్త ఉపగ్రహాల తయారీ, ప్రయోగ ఖర్చులను తగ్గించే అవకాశం ఉంటుంది.
అయితే ఈ ప్రయోజనాలు టెక్నాలజీ విజయవంతంగా పరీక్షించబడి, వాణిజ్య స్థాయిలో అందుబాటులోకి వచ్చినప్పుడే సాధ్యమవుతాయి. ఈ ప్రయోగంతోనే ఆగిపోకుండా.. 2027 ఫస్ట్ క్వార్టర్స్ లో మరో అడ్వాన్స్డ్ మిషన్‌కు OrbitAID Aerospace సిద్ధమవుతోంది.
Also read: సీజేపీ నిరసనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. వ్యాపారుల పిటిషన్ కొట్టివేత.. పోలీసులకు కీలక ఆదేశాలు!