Shradda Kapoor : టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన సాహో మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ శ్రద్ధ కపూర్. ఈమె బాలీవుడ్ నటి అయినా కూడా సౌత్ లో పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది.. సౌత్ లో శ్రద్ధ కపూర్ కి ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. గ్లామర్ రంగంలో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బాలీవుడ్ భామ ప్రస్తుతం సోషల్ మీడియా వరల్డ్ లో కూడా తిరుగులేని రాణిగా రాణిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యధికంగా సంపాదిస్తుంది ఈమె అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈమె ఎంత సంపాదిస్తుంది అన్నది ఒకసారి తెలుసుకుందాం..
ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్లు సినిమాలు కన్నా ఎక్కువ సోషల్ మీడియాలోనే హైపర్ యాక్టివ్ గా ఉంటున్నారు. తమ లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఒకప్పుడు సినిమా గురించి చెప్పే హీరోయిన్లు ఈమధ్య తమ పర్సనల్ లైఫ్ గురించి కూడా చెప్తున్నారు.. ఈ క్రమంలో చాలామంది అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోయిన్ లేదా హీరోలని ఫాలో అవుతూ వాళ్ల గురించి తెలుసుకుంటున్నారు.. ఇటీవల కాలంలో కొంతమంది హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా శ్రద్ధ కపూర్ కూడా ఆ లిస్టులో చేరిపోయింది. ఈమె అందరికన్నా ఎక్కువగానే సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 9.3 కోట్ల (93 మిలియన్ల)కు పైగా ఫాలోయింగ్ ఉన్న ప్రముఖులలో ఈమె స్థానం నెంబర్ వన్ గా ఉంది. డిజిటల్ ప్రమోషన్ల ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జిస్తూ సోషల్ మీడియాలలో అత్యధిక ఆదాయాన్ని పొందుతున్న హీరోయిన్గా మొదటి స్థానంలో నిలిచింది శ్రద్ధ కపూర్.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటుగా అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది..
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ వల్ల ఆమెకు మరికొన్ని బ్రాండ్లకు ప్రమోషన్స్ చేయాలని కోరుతున్నారు. శ్రద్ధ ఇప్పటికే పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సోషల్ మీడియా రికార్డు తర్వాత ఆమె అకౌంట్ లో మరికొన్ని బ్రాండ్స్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక్క బ్రాండెడ్ పోస్ట్ లేదా రీల్ ద్వారా ప్రచారం చేయడానికి సుమారు 1 కోటి నుండి 1.5 కోట్ల వసూల్ చేస్తుంది. అయితే సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న క్రేజ్ ప్రకారం ఆమె అడిగినంత ఇచ్చేందుకు ప్రముఖ కంపెనీలు కూడా సిద్ధంగా ఉన్నాయి.. మొత్తానికి శ్రద్ధ సినిమాలు కన్నా కూడా సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తుందని అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది..ఇటీవల ‘స్త్రీ 2’ సాధించిన భారీ బాక్సాఫీస్ విజయం తర్వాత శ్రద్ధా కపూర్ తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచినట్లు టాక్.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 12 కోట్ల నుండి 17 కోట్లు తీసుకుంటుంది.. ఏది ఏమైనా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఇప్పుడు ఈమె పేరు మారుమోగిపోతుంది.