Abrar Ahmed hits six on first ball in The Hundred: ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ (The Hundred Men’s Competition 2026) నిన్న ప్రారంభమైంది. ప్రారంభ మ్యాచ్ లోనే MI లండన్ వర్సెస్ సన్రైజర్స్ లీడ్స్ (MI London vs Sunrisers Leeds, 1st Match) జట్ల మధ్య తొలి మ్యాచ్ నిర్వహించారు. లండన్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Kennington Oval, London) వేదికగా ఈ మ్యాచ్ అర్ధరాత్రి 11 గంటలకు ప్రారంభమైంది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన ముంబై జట్టు, 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అటు మొదటి మ్యాచ్ లోనే కావ్య పాపకు సంబంధించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో మళ్లీ కావ్య పాప దేశద్రోహి అంటూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. అబ్రార్ అహ్మద్ ను (Abrar Ahmed) కొనుగోలు చేసిన విషయాన్ని మళ్లీ గుర్తు చేస్తూ దారుణంగా ఆడుకుంటున్నారు. దీంతో ఈ న్యూస్ మళ్లీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ లో (The Hundred Men’s Competition 2026) భాగంగా నిన్న ఎంఐ లండన్ వర్సెస్ సన్రైజర్స్ లీడ్స్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ లీడ్స్ జట్టు మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో పది వికెట్లు నష్టపోయి నష్టానికి 143 పరుగులు సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ అవకాశాన్ని దక్కించుకున్న పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, ఏడు పరుగులు సాధించాడు. ఇందులో సిక్సర్ కూడా ఉంది. తొలి బంతికే సిక్సర్ కొట్టాడు అబ్రార్ అహ్మద్. అయితే పాకిస్తాన్ కుర్రాడు అబ్రార్ అహ్మద్ సిక్స్ కొట్టిన నేపథ్యంలో ఓనర్ కావ్య పాప (Kavya Maran) సంబరాలు చేసుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో పాకిస్తానోడు బాగా ఆడితే… నువ్వు సంబరాలు చేసుకుంటావా ? అంటూ కావ్య పాప పై విరుచుకుపడుతున్నారు ఇండియన్ ఫ్యాన్స్. అనవసరంగా ఆ వెధవనుకొని.. ఇప్పుడు ట్రోలింగుకు గురవుతున్నావని మండిపడుతున్నారు. కావ్య పాప దేశద్రోహి అంటూ పోస్టులు పెడుతున్నారు.
ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభమైన తొలి మ్యాచ్ లోనే కావ్య పాప జట్టు సన్రైజర్స్ లీడ్ కు ఊహించని షాక్ తగిలింది. ముంబై చేతిలో దారుణ ఓటమిని చవిచూసింది సన్రైజర్స్. అయితే ఈ మ్యాచ్ లో అబ్రార్ అహ్మద్ కొట్టిన సిక్సర్ నేపథ్యంలో కావ్య సెలబ్రేషన్స్ చేసుకోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దేశ ద్రోహి అంటూ రెచ్చిపోతున్నారు.
FIRST BALL. FIRST SIX. WHAT A START TO ABRAR AHMED'S HUNDRED CAREER! 🥶 pic.twitter.com/LJiLQPVYRJ
— Sheri. (@CallMeSheri1_) July 21, 2026