E-Paper
Advertisement

HBD Daggubati Venkatesh : బర్త్ డే స్పెషల్.. వెంకీ మామ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..? మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

HBD Daggubati Venkatesh : బర్త్ డే స్పెషల్.. వెంకీ మామ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..? మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..
Advertisement

HBD Daggubati Venkatesh : టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప నటుడు. ఇండస్ట్రీలో తన పని తాను చేసుకునే హీరోలలో వెంకటేష్ కూడా ఒకరు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తూ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ ఘనవిజయాన్ని సాధించింది.. ప్రస్తుతం మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.. నేడు హీరో వెంకటేష్ పుట్టినరోజు.. ఆయన పుట్టినరోజు సందర్భంగా సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. వెంకీ బర్త్ డే సందర్బంగా ఆయన ఇప్పటివరకు ఎన్నికోట్ల ఆస్తిని సంపాదించాడు..? ప్రస్తుతం వెంకీ ఒక్కో సినిమాకి ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడు? వంటి వాటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

వెంకీ కి సెలబ్రిటీల స్పెషల్ విషెష్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన హీరో దగ్గుబాటి వెంకటేష్.. కుటుంబ కథా చిత్రాలలో ఎక్కువగా నటించిన వెంకటేష్ కు అభిమానులు ఎక్కువే.. మిగిలిన హీరోల లాగా వరుసగా సినిమాలను చెయ్యకుండా.. నినాదంగా ఒక్క సినిమా చేసిన చాలు అనుకునే వ్యక్తి. ప్రతి ఏడాది ఒక బ్లాక్ బాస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా వెంకీ అభిమానులు సంబరాలు చేస్తున్నారు.. ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు..

హీరో వెంకటేష్ ఆస్తులు ఎన్ని కోట్లంటే..?

Advertisement

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా వరసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు హీరో వెంకటేష్.. టాలీవుడ్ హీరో శోభన్ బాబు తర్వాత ఆ స్థానాన్ని హీరో వెంకటేష్ భర్తీ చేశారనే చెప్పాలి. ప్రేక్షకుల్లో వెంకీ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు ఆయన 80 కి పై సినిమాల్లో నటించి సూపర్ సక్సెస్ రేటుతో దూసుకుపోతున్నాడు. గత 36 ఏళ్లకు పై ఇండస్ట్రీలో నటుడుగా కొనసాగుతున్నాడు.ఆయన కెరీర్‌లో 7 సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డ్స్, 5 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకోవడంతో పాటు ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత రామా నాయుడు తనయుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం దాదాపు రూ. 25 వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులతో కలిపితే మరో రెండు వేల కోట్లు ఉంటాయని ఇండస్ట్రీలో టాక్. అలాగే ఇళ్లు, కార్లు ఇలా మొత్తం మీద ఆయనకు 4 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని సమాచారం.

Also Read : శ్రీవల్లి పై అనుమానం.. చందును అడ్డుకున్న శ్రీవల్లి.. రామారాజుకు నిజం తెలిసిపోతుందా..?

ఒక్కో సినిమాకు రెమ్యూనరేషన్ ఎంతంటే..? 

Advertisement

హీరో వెంకటేష్ 1986లో ‘కళియుగ పాండవులు’ అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు. అది సూపర్ డూపర్ హిట్ అవడంతో తర్వాత వరుసగా సినిమాలు చేసే అవకాశాన్ని అందుకున్నాడు.. ఆయన చేసిన సినిమాలు కొన్ని సూపర్ హిట్ అయితే.. మరికొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. వెంకీ మాత్రం ఎక్కడా నిరుత్సాహ పడకుండా సినిమాల కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు.. సింగిల్ హీరోగా మాత్రమే కాదు.. మల్టీస్టారర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకటేష్. ఆయన ఇటీవలి కాలంలోనే మహేష్‌తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, పవన్‌‌ కళ్యాణ్తో ‘గోపాల గోపాల’, రామ్‌తో ‘మసాలా’, అలా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఎఫ్2 సినిమాలో నటించాడు.. ఒక్కో సినిమాకు వెంకీ 10 నుంచి 15 కోట్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈయన సినిమాలతో పాటుగా.. అటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు..ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న వెంకటేష్ కి మా బిగ్ టీవీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతుంది. హ్యాపీ బర్త్ డే వెంకీ మామ..

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×