E-Paper
Advertisement

Vrushakarma film: నాగచైతన్య ‘ వృషకర్మ’ టైటిల్ అర్థం ఏంటో తెలుసా?

Vrushakarma film: నాగచైతన్య ‘ వృషకర్మ’ టైటిల్ అర్థం ఏంటో తెలుసా?
Advertisement

Vrushakarma film: సినీ నటుడు నాగచైతన్య (Nagachaitanya)తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. నాగచైతన్య, మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) హీరో హీరోయిన్లుగా కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu)దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు “వృషకర్మ” (Vrushakarma)అనే టైటిల్ అధికారకంగా ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పోస్టర్ చూస్తుంటే మాత్రం నాగచైతన్య లుక్ అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంటారని స్పష్టం అవుతుంది. ఈ సినిమా మైథాలజికల్ త్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ధర్మబద్ధమైన పనులు చేసేవారు..

ఇక ఈ సినిమాలో నటి మీనాక్షి చౌదరి దక్ష అనే పాత్రలో పురావస్తు శాఖ సైంటిస్ట్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ సినిమాకు వృషకర్మ అనే టైటిల్ ప్రకటించడంతో ఈ టైటిల్ పట్ల పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. నాగచైతన్య సినిమా టైటిల్ చాలా ఇంట్రెస్ట్ గా ఉందని ఈ సినిమా టైటిల్ కు అర్థం ఏంటి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే వృషకర్మ అనే పదానికి అర్థం ఏంటి అనే విషయానికి వస్తే… వృషకర్మ అంటే ధర్మబద్ధమైన పనులు చేసేవాడు అని అర్థం. ఇక ఈ పదం విష్ణు సహస్రనామాలలో ఒకటిగా ఉంది. వృష అంటే ధర్మం.. కర్మ అంటే పని అని అర్థం ఇలా ధర్మబద్ధంగా పనులు చేసేవారు అనే అర్థం రావడంతో ఈ సినిమాలో నాగచైతన్య పాత్ర ఏంటో స్పష్టమవుతుంది.

ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా…

Advertisement

ఈయన ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా ఈ సినిమాలో కనిపించబోతున్నారని ఈ సినిమా టైటిల్ చూస్తేనే స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుకుమార్ శిష్యుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన కార్తీక్ వర్మ విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కార్తీక్ తదుపరి నాగచైతన్యతో సినిమా చేయబోతున్నారు.

ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్..

Advertisement

ఇక ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశారు. ఈ సినిమా నాగచైతన్య సినీ కెరియర్ లోనే గుర్తుండిపోయే సినిమాగా నిలిచిపోతుందని చెప్పాలి. ఇప్పటివరకు ఈ తరహా జానర్ లో నాగ చైతన్య నటించలేదు. మొదటిసారి ఇలాంటి మైథాలజీ నేపథ్యంలో నాగచైతన్య నటించిన బోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాదులో షూటింగ్ పనులను జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చిత్ర బృందం ఈ సినిమా మేకింగ్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Also Read: Actor Ajith Kumar: ‘ జెంటిల్ మెన్  డ్రైవర్ అఫ్ ది ఇయర్’గా  హీరో అజిత్ .. అరుదైన గౌరవం అందుకున్న హీరో!

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×